News


11900 వద్ద నిఫ్టీకి నిరోధం

Friday 21st June 2019
Markets_main1561099974.png-26473

నిఫ్టీ శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు అరశాతం నష్టంలో ఉంది. గురువారం అనూహ్య అప్‌మూవ్‌ చూపిన సూచీలు డైలీ చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ ఏర్పరిచాయి. నిఫ్టీ కీలక 50 రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొంది పైకి ఎగిసింది. ఇకపై 11680 పాయింట్లు(50 రోజుల డీఎంఏ) కీలకం కానుంది. తాజా అప్‌మూవ్‌లోమరోమారు నిఫ్టీ తన స్వల్పకాల ట్రేడింగ్‌ జోన్‌ పై అవధిని తాకవచ్చు. ఈ స్థాయి 11900- 11980 పాయింట్ల వద్ద ఎదురవుతుంది. కీలక మద్దతు 11680- 11740 పాయింట్ల మధ్య దొరుకుతుంది. నిఫ్టీ మరింత ముందుకు సాగాలంటే 11900 పాయింట్ల ఆటంకాన్ని బలంగా దాటగలగాలని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకు నిఫ్టీ సైతం గురువారం ట్రేడింగ్‌లో మంచి జోరు చూపింది. చార్టుల్లో ఫాలింగ్‌ చానెల్‌ పాటర్న్‌ నుంచి బయటపడినట్లు కనిపిస్తోంది. బ్యాంకు నిఫ్టీ 30900 పాయింట్ల జోన్‌ వద్ద బలమైన నిరోధం ఎదుర్కొంటోంది.  ఈ స్థాయిని బలంగా దాటితే 31200 పాయింట్ల వరకు ర్యాలీ ఉండొచ్చు. ఇండికేటర్లలో ఆర్ఎస్‌ఐ బుల్లిష్‌గా మారింది. అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సీరిస్‌లో సూచీలు పాజిటివ్‌ ధృక్పధాన్నే చూపవచ్చని నిపుణుల అంచనా. ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే నిఫ్టీలో 11700, 11500 పాయింట్ల వద్ద పుట్స్‌, 12000 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా పోగయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఫ్టీ ఫ్యూచర్స్‌ దాదాపు 20 పాయిట్ల ప్రీమియంలో ట్రేడవుతోంది. 
 



You may be interested

వ్యవస్థలోకి వెల్లువలా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ పెట్టుబడులు

Friday 21st June 2019

భారత్‌ ఆర్థికవ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌ ఉత్సుకతను చూపుతున్నాయి. విమానశ్రయాల నుంచి పునరుత్పాదక ఇంధనం వరకు ప్రతిదానిలో విపరీతంగా వాటాను కొనుగోలు చేస్తున్నాయి. ఈసారి దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, దేశంలో మధ్యతరగతి ఆర్థికవ్యవస్థ  బలోపేతం కావడం ఇందుకు కారణవుతున్నాయి. ఇది వరకు సావరిన్‌, స్టేట్‌ పెన్షన్ల​ఫండ్లు ఈక్విటీ, బాండ్ల మార్కెట్లలో మాత్రమే తమ పెట్టుబడులను పెట్టేవి. ఇప్పుడు వాటి వ్యాపార విస్తృతిస్థాయి మరింత పెంచుకొని ప్రైవేట్‌

ఆ లక్ష్యానికి మరో రెండేళ్లు ఆలస్యం:హెరిటేజ్‌

Friday 21st June 2019

హైదరాబాద్‌: డెయిరీ కంపెనీ హెరిటేజ్‌ నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి మరో రెండేళ్లు ఆలస్యం కానుంది. 2022 నాటికి రూ.6,000 కోట్ల టర్నోవర్‌ స్థాయికి చేరుకుంటామని గతంలో కంపెనీ వెల్లడించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది 2024 అవుతుందని తెలిపింది. ‘సరఫరా అధికం కావడంతో పాల సేకరణ ధర తగ్గింది. దీంతో కొన్ని మార్కెట్లలో పాలు, పాల ఉత్పత్తుల ధర తగ్గించాల్సి వచ్చింది. ఈ కారణంగా వృద్ధి మందగించింది. ప్రస్తుతం

Most from this category