News


11770 వద్ద నిఫ్టీకి నిరోధం

Thursday 18th July 2019
Markets_main1563436024.png-27158

మార్కెట్లు బడ్జెట్‌ అనంతరం పతనం చవిచూసి ప్రస్తుతం కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మారాయి. కొన్ని రోజులుగా నిఫ్టీ 11460 పాయింట్లను కాపాడుకుంటూ చిన్నపాటి బౌన్స్‌ బ్యాక్‌ చూపింది. ప్రస్తుతానికి నిఫ్టీ ట్రెండ్‌ స్వల్పంగా పాజిటివ్‌గానే ఉందని, కానీ సూచీల్లో జోరు కనిపించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండు రోజులుగా మార్కెట్లో లిక్విడిటీ కొరత కారణంగా చిన్న కదలికలే నమోదు కావడం గమనించవచ్చన్నారు. చార్టుల్లో స్పిన్నింగ్‌ టాప్‌ క్యాండిల్‌ ఏర్పడి ట్రెండ్‌ న్యూట్రల్‌గా ఉన్నట్లు చూపుతోంది. ఆప్షన్ల పరంగా 11300 పుట్‌ నుంచి 11600 పుట్‌కు ట్రేడర్లు మారడం కనిపిస్తోంది. దీన్ని బట్టి నిఫ్టీ మద్దతు స్థాయిలు పైకి పెరిగినట్లు గమనించవచ్చు. కాల్స్‌లో 11700నుంచి 12000 వరకు వరుసగా అధిక ఓఐ కనిపిస్తోంది. 11700 పాయింట్ల నుంచి 11800 పాయింట్ల మధ్య గట్టి నిరోధం ఉంది. అందువల్ల నిఫ్టీ స్వల్పకాలానికి చిన్నపాటి రేంజ్‌లో కదలాడే అవకాశాలున్నాయి. 
నిఫ్టీకి 11775 పాయింట్ల వద్ద నిరోధం ఉంది. దీన్ని దాటితే మరోమారు 11900- 12000 పాయింట్ల వరకు పెరగవచ్చు. దీన్ని దాటటంలో విఫలమైతే మరోమారు 11460 పాయింట్ల స్థాయికి అక్కడ పట్టు కోల్పోతే 11300 పాయింట్లకు దిగజారవచ్చు. ఈ స్థానాలను బట్టి లాంగ్స్‌, షార్ట్‌ పొజిషన్లు ఏర్పరుచుకోవాలి. సూచీల్లో అనిశ్చితి ఉన్నందున ట్రేడర్లు కచ్ఛితమైన స్టాప్‌లాస్‌ పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 



You may be interested

వృద్ధి రేటు అంచనాకు ఏడీబీ మరోసారి కోత

Thursday 18th July 2019

భారత్‌ వృద్ధి అంచనాను ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్(ఏడీబీ) మరోసారి కోత విధించింది. ఏడీబీ ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీఓ) 2019 నివేదికను గురువారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) గానూ భారత్‌ వృద్ధి 7శాతం మాత్రమే నమోదవుతుందని అంచనా వేసింది. ఇంత క్రితం ఇదే ఏడాది(2019) ఏప్రిల్‌లో దేశీయ వృద్ధిరేటు అంచనా 7.2 శాతంగా ఉంటుందని బ్యాంకు అంచనా వేసింది. ఆర్థిక ఆందోళనలు వృద్ధి రేటు తగ్గింపునకు కారణమని

కరుగుతున్న మెటల్‌ షేర్లు

Thursday 18th July 2019

2శాతం క్షీణించి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌  నష్టాల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా గురువారం మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. అంతర్జాతీ వృద్ధి ఆందోళనలు తెరపైకి రావడం ఇందుకు కారణమవుతున్నాయి. గత నెలలో జీ-20 సదస్సులో జరిగిన ఒప్పందం ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పుత్తులను చైనా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ట్రంప్‌ ప్రశ్నించారు. అవసరమైతే వాషింగ్టన్ అదనంగా 325 బిలియన్ల విలువైన చైనా వస్తువులపై సుంకాలను విధింపునకు వెనకాడదని హెచ్చరించారు. దీనిపై స్పందించిన

Most from this category