News


స్వల్పకాలంలో ఇన్ఫోసిస్‌ డీరేటింగ్‌

Tuesday 22nd October 2019
Markets_main1571741682.png-29062

-ప్రస్తుత పరిస్థితులు తేలే వరకు దూరంగా ఉండండి: హెమాంగ్‌ జానీ, షేర్‌ఖాన్‌
‘కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడంతో మొత్తంగా పీఎస్‌యూ స్టాకులపై సానుకూలత పెరిగింది. బీపీసీఎల్‌ పై 30శాతం నుంచి 50 శాతం ప్రీమియం ఇవ్వడానికి ఏ ఇన్వెస్టరు వెనకడుగేయడంలేదు’ అని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెమాంగ్‌ జానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..
ప్రీమియమైనా ఓకే.. 
  ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడంతో పీఎస్‌యూ స్టాకులు అధికంగా లాభపడనున్నాయి. అన్నిటికన్నా బ్యాలెన్స్‌ షీట్‌లు బాగున్న కంపెనీలు, సీరియస్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న కంపెనీలకు ఈ చర్య చాలా సానుకూలమైనది. బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ వంటి కంపెనీల షేర్లు రీరేటింగ్ చెందుతాయి. బీపీసీఎల్‌ వంటి కంపెనీలు వాటి రంగాలలో ముఖ్యమైనవి ఉన్నాయి. ఇలాంటి కంపెనీలలో మేనేజ్‌మెంట్‌ మారుతున్నప్పుడు ఈ షేర్లకు అధిక ప్రీమియం ఇవ్వడానికి ఇన్వేస్టర్లు సిద్ధంగా ఉంటారు. బీపీసీఎల్‌ షేరు గత ఏడాది కాలంలో భారీగా లాభపడింది. బీపీసీఎల్‌కు మార్కెటింగ్‌, రిఫైనింగ్‌ రెండు విభాగాలలో కూడా పంపిణీ నెట్‌వర్క్‌లో మంచి వాటా ఉంది. అందుకే ఈ షేరుకు 30 శాతం నుంచి 50 శాతం ప్రీమియం ఇవ్వడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. ప్రతి కంపెనీని పరిశీలించాక ఆ కంపెనీలకిచ్చే విలువను నిర్థారించవచ్చు. మొత్తంగా పీఎస్‌యూ స్టాకులపై సెంటిమెంట్‌ బలపడిందని మాత్రం నమ్ముతున్నా.

రిలయన్స్‌ డిమెర్జర్‌పై దృష్టి
రిలయన్స్‌కు ఉన్న వ్యాపారాలలో మూడు వ్యాపారాలకు సంబంధించిన ఫలితాలు అంచనాల కంటే అధికంగా ఉన్నాయి. రిలయన్స్‌ రిటైల్‌, రిలయన్స్‌ జియో వ్యాపారాల ఆపరేటింగ్‌ లాభం, టాప్‌లైన్‌(ఆదాయం) ఆశాజనకంగా ఉండడంతో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి ఈ వ్యాపారాల డీమెర్జ్‌పై మార్కెట్‌ వర్గాలు అధికంగా ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేకాకుండా ఆరామ్‌కో లేదా ఇతర కంపనీలు ఈ వ్యాపారాలలో ఇన్వెస్ట్‌చేస్తే, ఈ రెండు వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి విలువను ఒకరు పొందగలరనే అంశంపై అందరి దృష్ఠి ఉంది. కంపెనీ యాజమాన్యం కూడా కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ నిర్వహణను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది.  గత 10-15 ఏళ్ల రిలయన్స్‌ చరిత్రను గమనిస్తే.. రిలయన్స్‌ తమ వ్యాపారాలను ముందు మెరుగుపరిచి, ఆ తర్వాత ఇన్వెస్టర్లను ఆ వ్యాపారాలలోకి ఆహ్వానించడం గమనించవచ్చు. వచ్చే 6 నెలలు లేదా 12 నెలల కాలంలో ఇటువంటి చర్యలే రిలయన్స్‌ వ్యాపారాలలో చోటుచేసుకునే అవకాశం ఉంది. రిలయన్స్‌కు చెందిన ముఖ్యమైన వ్యాపారం బాగానే ఉంది. రిఫైనింగ్‌ వృద్ధి అంత గొప్పగా లేనప్పటికి పెట్రోకెమికల్‌ వ్యాపారం మంచి ప్రదర్శన చేస్తోంది. వీటితో పాటు మిగిలిన రెండు  వ్యాపారాలు అంచనాల కంటే ప్రదర్శన చేస్తున్నాయి.

ఆరోపణలు తేలేవరకు వేచి ఉండాలి..
ప్రస్తుతం కంపెనీల అధ్వాన్న ప్రదర్శన కంటే ఆ కంపెనీల కార్పోరేట్‌ గవర్నెన్స్‌పై మార్కె‍ట్‌ వర్గాలు అధికంగా దృష్ఠిపెడుతున్నాయి. ఇన్ఫోసిస్‌పై వచ్చిన ప్రస్తుత ఆరోపణలు ఆ కంపెనీ మేనేజ్‌మెంట్‌ పద్ధతులపై  ప్రభావం చూపుతుంది.  ఈ ఆరోపణలు నిజమేనా లేక కొంతమంది ఆసంతృప్తి ఉద్యోగులు చేసిన ఆరోపణలేనా? అనే విషయంపై స్పష్టత వచ్చేంత వరకు ఈ కంపెనీపై ప్రతికూల ప్రభావం ఉంటుం‍ది. ఒక కంపెనీకి తక్కువ మార్జిన్‌ల వద్ద బిడ్లు దాఖలు చేయడం లేదా ఖర్చుల విషయంలో కొంత దూకుడుగా ఉండడం వంటి అంశాలు ఈ దేశంలో సాధరణ విధానాలుగా మారిపోయాయి. వీటిని మార్కెట్‌ వర్గాలు అంచనావేయగలవు. మొత్తంగా​ ఈ ఆరోపణలకు కారణం ఇన్ఫోసిస్‌ పాలన వర్గంలోని లోపమని అనుకోవడం లేదు. ఇన్ఫోసిస్‌ వంటి పెద్ద కంపెనీలలో కొంత మంది వ్యక్తులు కార్పోరేట్‌ పరిపాలనను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని నా నమ్మకం. కానీ ఈ అంశంపై పూర్తిగా స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడడం మంచిది. అందువలన ఇన్ఫోసిస్‌ షేరు కొంతమేర డీరేటింగ్‌కు గురవుతుందని అంచనావేస్తున్నాం.

ద్విచక్రంలో ‘హీరో’
గత రెండేళ్ల నుంచి ద్విచక్రవాహన రంగం త్రీవ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ త్రేమాసికంలో కూడా ఈ కంపెనీల వాహనాల సంఖ్య వృద్ధి లేదా ఇబిటా మార్జిన్‌లు అంత గొప్పగా లేవు. కానీ ఒకవేళ వచ్చే 12 నెలల్లో ఆటోరంగం పుంజుకునే అవకాశాలుంటే, ద్విచక్రవాహన విభాగాన్ని పరిశీలించవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో అధిక వాటాను కలిగివుండడంతో హీరో మోటర్‌​కార్ప్‌, బజాజ్‌ షేర్లను పరిశీలించవచ్చు. మొత్తంగా ద్విచక్ర వాహన విభాగాలపై ఇన్వెస్ట్‌చేయడానికి, అమ్మకాల సంఖ్య బాగునేంత వరకు వేచి ఉండడం మంచిది.



You may be interested

స్వల్ప నష్టాలతో ప్రారంభం

Wednesday 23rd October 2019

క్రితం రోజు నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 14 పాయింట్ల నష్టంతో 38.950 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 11,580 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బ్రిటానియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌లు 1-2 శాతం మధ్య పెరగ్గా, అదాని పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, 2-3 శాతం మధ్య క్రాష్‌కాగా, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, జీ

మార్కెట్‌కు ‘‘ఇన్ఫీ’’ నష్టాలు

Tuesday 22nd October 2019

39000 దిగువన సెన్సెక్స్‌  11600 కింద ముగిసిన నిఫ్టీ 16.50శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్‌ షేర్లు మార్కెట్‌ ఆరురోజుల ర్యాలీకి ఇన్ఫోసిస్‌ షేర్ల భారీ పతనం అడ్డుపడింది. కంపెనీ యాజమాన్యం ఆదాయం, లాభాలను పెంచి చూపుతుందని విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి రావడంతో నేడు ఇన్ఫోసిస్‌ 16.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌ షేర్ల క్షీణత సూచీల భారీ నష్టాలకు కారణమైంది. అలాగే బ్రెగ్జిట్ ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను కొంతమేర దెబ్బతీసింది. ఫలితంగా మార్కెట్‌

Most from this category