News


భారత మార్కెట్‌లో ఇంకా రిస్క్‌ ఉంది..!

Wednesday 14th November 2018
Markets_main1542192328.png-22007

  • సీఎల్‌ఎస్‌ఏ ఇండియా స్ట్రాటజిస్ట్ మహేష్ నందూర్కర్ వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత మార్కెట్‌లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించిన సీఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌, ఇండియా స్ట్రాటజిస్ట్ మహేష్ నందూర్కర్.. వచ్చే కొద్ది నెలల్లో ద్రవ్య లోటు, వడ్డీ రేట్లు అంశాలు మార్కెట్‌కు అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయని వివరించారు. సంస్థ 21వ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మార్కెట్ల భవిష్యత్తుపై తన విశ్లేషణను ఇచ్చారు. రాజకీయ అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందన్నారు. మరికొన్ని సూచనలు చేశారు.

పెట్టుబడి సూచనలు: డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగ షేర్లను చూడవచ్చు. వచ్చే ఏడాది మార్చినాటికి రూపాయి 71-75 స్థాయిలో ఉండేందుకు అవకాశం ఉంది. డిస్క్రిషనరీ రంగ షేర్లను కొనుగోలు చేయవచ్చన్న ఆయన ఎన్‌బీఎఫ్‌సీ, టెలికాం, మెటీరియల్‌, ఫైనాన్షియల్స్‌కు అండర్‌వెయిట్‌ ఇచ్చినట్లు తెలిపారు. హౌసింగ్‌ మార్కెట్‌ త్వరలోనే బోటమ్‌అవుట్‌ అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

క్రూడ్‌ రిస్క్‌: ముడిచమురు ధరలు పెరిగితే భారత మార్కెట్లకు ఇబ్బంది తప్పదు.

క్యూ2 ఫలితాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. అయితే, బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు తగ్గడం పాజిటీవ్‌ అంశమన్నారు. ఐటీ రంగ షేర్లు బోటమ్‌ అప్‌ విశ్వాసాన్ని ఇచ్చాయి. 

ఎన్‌బీఎఫ్‌సీ: వచ్చే కొన్ని త్రైమాసికాల వరకు ఈ రంగంలో వృద్ధిరేటు ఉండకపోవచ్చు. స్థూల ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రతికూలంగా ఉందన్నారు. 

రిటైల్‌ ప్రవాహం: సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ (సిప్‌) ద్వారా వచ్చే రిటైల్‌ ప్రవాహం మార్కెట్‌ ప్రయాణాన్ని ప్రభావితం చేయనుందన్నారు.You may be interested

కోల్‌ ఇండియాతో కేంద్రానికే లాభాల పంట!

Wednesday 14th November 2018

కోల్‌ ఇండియా... ఇది కేంద్రం ప్రభుత్వరంగ మహారత్న కంపెనీ. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు ఉత్పత్తి సంస్థ. దేశీయ బొగ్గు రంగంలో గుత్తాధిపత్యం కలిగినది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు కచ్చితంగా వస్తాయి...? అని అనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది!. ఎందుకంటే కోల్‌ ఇండియా స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ అయి ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ కాలంలో ఇది కేవలం డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.74,000 కోట్ల

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Wednesday 14th November 2018

ఐటీ, పార్మా రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ బుధవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ 2.50 పాయింట్ల నష్టంతో 35,142 వద్ద, నిఫ్టీ 6.20 పాయింట్లను కోల్పోయి 10,576 వద్ద ముగిసింది. ముడిచమురు పతనంతో ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీ లాభాలను ఆర్జించిన సూచీలు చివరి వరకు లాభాలను నిలుపుకోవడంతో విఫలమయ్యాయి. రూపాయి బలపడంతో ఐటీ, ఫార్మా షేర్ల పతనం సూచీల లాభాలను హరించివేశాయి. బ్యాంకింగ్‌,  ఫైనాన్స్‌ రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో

Most from this category