News


అప్రమత్తంగా ఉండి.. ఫండమెంటల్స్‌పై దృష్టి..

Tuesday 31st December 2019
Markets_main1577731227.png-30538

నూతన సంవత్సరం 2020 వచ్చేస్తోంది. 2019 సంవత్సరం మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో అస్థిరతలను చూశాం. ప్రధాన సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్‌ నూతన జీవితకాల గరిష్టాలను చేరాయి. సవాళ్లతో కూడిన పరిస్థితుల నడుమ అధిక రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలన్న సందేహం రావచ్చు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు 2020లో అనుసరించాల్సిన విధానాలను ఎంట్రస్ట్‌ ఫ్యామిలీ ఆఫీస్‌ ఎండీ రాజమోహన్‌ కృష్ణన్‌ ఓ వార్తా సంస్థకు తెలియజేశారు. 

 

వడ్డీ రేట్లు
ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉంది. వృద్ధి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో దీర్ఘకాలిక వడ్డీ రేట్లు తగ్గేందుకు అవకాశాలున్నాయి. అంతర్జాతీయ వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉండడం దీనికి మద్దతునిస్తోంది. అయితే, ప్రభుత్వ రుణాల విషయంలో ఉన్న అనిశ్చితి వడ్డీ రేట్లు తగ్గకుండా నిలువరిస్తోంది. ఇది తొలగిపోవడానికి రెండు మూలు నెలలు పడుతుంది. తగ్గిన వడ్డీ రేట్లను రుణ గ్రహీతలకు బదలాయించడం జరిగితే అప్పుడు నిలిచిపోయిన పెట్టుబడుల వాతావరణం తిరిగి మొదలవుతుంది. ఈ వాతావరణం దీర్ఘకాలిక బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్‌కు సానుకూలం అవుతుంది. 2020లో ఇదొక సురక్షిత, లాభదాయక సాధనం అవుతుంది.

 

జీడీపీ వృద్ధి - ఈక్విటీ రాబడులు
ఆర్థిక పరిస్థితులు బలహీనపడినా కానీ, స్టాక్‌ మార్కెట్లు కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి, వ్యాల్యూషన్ల ప్రకారమే నడుస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. సమీప కాలంలో జీడీపీ వృద్ధిపై చాలా రంగాల వృద్ధి ఆధారపడి ఉంటుంది. పెద్ద బ్యాంకులు, టెలికం రంగం, యుటిలిటీలు ఇందుకు ఉదాహరణలు. కరెంట్‌, సేవింగ్స్‌ ఖాతాల ఫ్రాంచైజీలు బలంగా ఉన్న బ్యాంకుల వృద్ధి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. టెలికం రంగం గత ఆరేడేళ్లుగా స్థిరీకరణకు గురైంది. మూడు సంస్థలు మిగిలాయి. అంతర్జాతీయంగా ఓ టెలికం వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం 8-39 డాలర్ల మధ్య ఉంటే, మన దేశంలో ఇది 2 డాలర్లుగానే ఉంది. దీంతో టెలికం ఆదాయం, లాభాలు మెరుగ్గా కోలుకునే అవకాశాలున్నాయి. గత రెండేళ్ల కాలంలో మార్కెట్ల పనితీరు చాలా పరిమితంగా ఉంది. కేవలం టాప్‌ 10-12 స్టాక్స్‌ మార్కెట్ల ర్యాలీకి అధికంగా తోడ్పడ్డాయి. మార్కెట్‌ వ్యాప్తంగా చాలా స్టాక్స్‌ ప్రతికూల రాబడులు ఇచ్చాయి. దీంతో 2020లో వీటిల్లో మంచి అవకాశాలను గుర్తించాలి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగం పూర్తి ఆకర్షణీయంగా ఉంది.

 

ప్రత్యామ్నాయాలు..
బలహీన మార్కెట్‌ పరిస్థితుల్లో నాణ్యమైన ఐపీవోలు దీర్ఘకాలానికి మంచి పెట్టుబడి అవకాశాలు అవుతాయి. ఐపీవో ముందస్తు పెట్టుబడి అవకాశాలు కూడా మంచి ప్రతిఫలాన్నిస్తాయి. అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకులు నగదు ముద్రణను చేపడుతున్న దృష్ట్యా బంగారం కూడా మంచి పెట్టుబడి సాధనమే అవుతుంది. You may be interested

ర్యాలీ ఉంటుంది కానీ..

Tuesday 31st December 2019

2020లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ర్యాలీ ఉంటుందని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది దేశ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణపైనే ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   ‘‘ఏదైనా రికవరీ ఉంటే అది ఎక్కువగా 2020 రెండో భాగం (జూన్‌ తర్వాత)లోనే. మొదటి భాగంలో లార్జ్‌క్యాప్స్‌ మంచి పనితీరు కొనసాగుతుంది. జీడీపీ వృద్ధి గణాంకాల ఆధారంగా మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌లోకి అడుగు పెట్టాలా లేదా అన్నది నిర్ణయించుకోవాలి’’ అని జేఎం ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషనల్‌

టెలికంలో చౌక చార్జీల శకం ముగిసినట్లేనా?!

Monday 30th December 2019

కనీస రీచార్జి వాలిడిటీ ప్లాన్‌ను ఒక్కసారిగా 95 శాతం పెంచుతూ ఎయిర్‌టెల్‌ తీసుకున్న నిర్ణయం, టెలికం రంగంలో చౌక చార్జీల యుగానికి శుభం కార్డు వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఎయిర్‌టెల్‌ వినియోగదారుడు కొత్త నెంబర్‌ తీసుకుంటే చేయించుకోవాల్సిన కనీస రీచార్జి రూ. 23 ఉండేది. ఇప్పడీ చార్జీని ఎయిర్‌టెల్‌ రూ. 45కు పెంచింది. దీంతో టారిఫ్‌లు పెంచుకొని రెవెన్యూను అభివృద్ధి చేసుకోవాలన్నదే టెల్కోల ప్రాధాన్యంగా మారినట్లు తెలుస్తోందని, గతంలోలాగా

Most from this category