News


నాలుగేళ్లలో ఆర్‌ఐఎల్‌ డబుల్‌!

Thursday 5th December 2019
Markets_main1575541355.png-30076

టీసీజీ ఏఎంసీ ఎండీ చక్రి లోక్‌ప్రియ అంచనా
దేశీయ చమురు దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు కావచ్చని టీసీజీ ఏఎంసీ ఎండీ చక్రి లోక్‌ప్రియ్‌ అంచనా వేశారు. ప్రస్తుతం కంపెనీ అన్ని విభాగాలు జోరుమీదున్నాయన్నారు. జియో లాభాలు పెరుగుతాయని, రిటైల్‌ వ్యాపారం మరింత విస్తరిస్తుందని అందువల్ల రాబోయే మూడేళ్లలో షేరు 20-25 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేయగలదని అభిప్రాయపడ్డారు.

ఇంకా వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలు... 
- బీమావ్యాపారాన్ని లిస్టింగ్‌కు తీసుకురావడం, మ్యూచువల్‌ ఫండ్‌ విభాగంలో వాటాలు అమ్ముకోవడం, క్రెడిట్‌కార్డుల విభాగాన్ని కూడా లిస్టింగ్‌కు తేవాలని యోచించడం.. ఎస్‌బీఐ విలువ పెంచే చర్యలు. అన్ని పీఎస్‌యూబ్యాంకులు మూలధన కొరతతో ఉన్నా, ఎస్‌బీఐకి ఆ భయం లేదు. బ్యాంకు విభాగాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. అందువల్ల భవిష్యత్‌లో బ్యాంకు షేరు మరింత మంచి ప్రదర్శన చూపగలదు. 
- చమురు ధర 70 డాలర్ల పైకి రాకపోయినా ఎయిర్‌లైన్స్‌ ఇబ్బంది పడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఒక దశకు మించి టారిఫ్‌లు పెంచుకునే వీలు లేకపోవడమే! ఎయిర్‌టికెట్‌ ధరలు నియంత్రణా సంస్థ నిర్ధారించిన పరిధిలోనే ఉండాలి. దీనికితోడు వీటి ఏటీఎఫ్‌ కొనుగోళ్ల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఎయిర్‌లైన్‌ స్టాకులపై బేరిష్‌ ధృక్పధమే ఉంటోంది. అంతర్జాతీయంగా ఎయిర్లైన్స్‌ షేర్లు మంచి ప్రదర్శన చూపుతున్నా, దేశీయ స్టాకులు మాత్రం పేలవంగానే కనిపిస్తున్నాయి. అందువల్ల ట్రేడింగ్‌ కోసమైతే వీటిని పరిశీలించవచ్చు కానీ లాంగ్‌టర్మ్‌ పెట్టుబడులకు ఈ షేర్లు అనుకూలం కాదు. 
- నిధుల సమీకరణ అనంతరం భారతీ ఎయిర్‌టెల్‌ అప్పులు బాగా దిగివస్తాయి. పైగా టారిఫ్‌ల పెంపుదల మరింత కలిసివస్తుంది. భవిష్యత్‌లో టెలికం కంపెనీలు మరిన్ని మార్లు టారిఫ్‌లు పెంచవచ్చు. ఇవన్నీ కంపెనీ బాలెన్స్‌ షీట్‌ను బలోపేతం చేస్తాయి. కంపెనీకి రుణభారం ఉన్నా, క్రమంగా ఫండమెంటల్స్‌ మెరుగవుతున్నందున కోలుకుంటుంది. ప్రస్తుత స్ధాయిల వద్ద ఎయిర్‌టెల్‌ షేరు కొనుగోలు చేయవచ్చు. You may be interested

మార్కెట్‌కు ఆర్‌బీఐ ఝలక్‌..!

Thursday 5th December 2019

 వడ్డీరేట్లు తగ్గించకపోవడంతో నిరాశ సెన్సెక్స్‌ 71పాయింట్ల నష్టం 25 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ నష్టాల బాట పట్టిన బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లు మార్కెట్‌ వర్గాల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో మార్కెట్‌ గురువారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 71పాయింట్లు నష్టపోయి 40,779.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్ల పతనమై 12,018 వద్ద ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన పాలసీ సమావేశాల అనంతరం నేడు వడ్డీ రేట్లలో ఎలాంటి

రిలయన్స్‌ టార్గెట్‌ పెంచిన గోల్డ్‌మేన్‌ శాక్స్‌

Thursday 5th December 2019

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మేన్‌ శాక్స్‌ దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను పెంచింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరపు ఆదాయాలను కూడా పెంచింది. ఇటీవల కాల్‌, డేటాలపై పెంచిన టారీఫ్‌లతో యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌(ఏఆర్‌పీయూ) వృద్ది చెందే అవకాశం ఉంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి సబ్‌స్క్రైబర్లు వలస రావడంతో పాటు జియో నెట్‌వర్క్‌కు ఉండే బలమైన సబ్‌స్ర్కిబ్షన్‌ కూడా మూమెంట్‌ను మరింత మెరుగుపరుస్తుంది.

Most from this category