News


రిలయన్స్‌ రిటైల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.2.5 లక్షల కోట్లు!

Tuesday 2nd July 2019
Markets_main1562056451.png-26740

అనధికార మార్కెట్లో భారీ ధరకు లావాదేవీలు

రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో నమోదుకానుందనే వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లకు అనధికార మార్కెట్లో డిమాండ్‌ పెరిగింది. రిటైల్‌ రంగంలోని మిగిలిన కంపెనీల కంటే ఈ కంపెనీ విలువ ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అనధికార మార్కెట్లో ఈ షేరు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.5 లక్షల కోట్లకు చేరిందని,  నమోదైనా ఏడు ప్రత్యర్థి కంపెనీల మొత్తం మార్కెట్‌క్యాప్‌ కంటే  75 శాతం ఎక్కువని భావిస్తున్నారు. గత రెండు వారాల నుంచి అనధికార మార్కెట్లో ఈ కంపెనీ షేరు విలువ రూ.475-రూ. 500 మధ్య ట్రేడవుతోందని, ఈ షేర్లు పరిమితంగానే అందుబాటులో ఉండడంతో షేరుకు డిమాండ్‌ బాగా పెరిగిందని అడిగే రేటు రూ.700-800 మధ్య పలుకుతోందని బ్రోకర్లు తెలిపారు. 
   రిలయన్స్‌ షేర్లను పరిమితంగా అందుబాటులోకి తీసుకురావడం వలన వీటి విలువ 30-40 శాతం అధికంగా రేట్లు పెరిగాయి. ‘పేరుకుపోతున్న రిలయన్స్‌ గ్రూప్‌ అప్పుల  నుంచి బయటపడేందుకు రిలయన్స్‌ రిటైల్‌ను  స్టాక్‌ మార్కెట్లో నమోదు చేయనున్నారు’ అని జమ్నదాస్‌ విర్జీ అడ్వెజరీ నిర్వహణ భాగస్వామి ధరన్‌ షాహ్‌ అన్నారు. 2019 మార్చి 31 నాటికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అప్పులు రూ.2.72 లక్షల కోట్లు ఉండగా, ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజెషన్‌ రూ. 8.04  లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్‌ ఆయిల్‌, టెలికాం కంపెనీలు కలిసి అప్పులను తగ్గించుకునేందుకు అనేక అవకాశాలను పరిశీలిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 
     వార్షిక ఆదాయం పరంగా రూ.1 లక్ష కోట్లు దాటిన ఏకైక దేశియ కంపెనీగా రిలయన్స్‌ రిటైల్‌ నిలిచింది. కంపెనీ  2018-19 ఆర్థిక సంవత్సరపు ఆదాయం రూ.1,30,556 కోట్లుగా ఉంది. ఈ మొత్తం ముందు ఏడాది(రూ. 69,198కోట్లు) ‍కంటే 89 శాతం అధికం కావడం గమనర్హం. ‘ రిలయన్స్‌ రిటైల్‌ షేరు డిమాండ్‌ పెరుగుతోంది. రూ.380-390 శ్రేణిలో ఆసక్తిగా కనిపిస్తోంది’ అని షాహ్‌ తెలిపారు. షేరు రూ. 500 ధర వద్ద రిలయన్స్‌ రిటైల్‌ పీఈ విలువ 2019 ఆర్థిక సంవత్సరం నికర లాభాల కంటే  200రెట్లు అధికం.  పీఈ విలువ 2019 ఆర్థిక సంవత్సరపు సంపాదనకు దేశియ కంపెనీలైన అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌ 93 రెట్లు , ప్యూచర్‌ రిటైల్‌ 33 రెట్లుగా ఉన్నాయి. అంతార్జాతీయ రిటైల్‌ దిగ్గజాలయిన వాల్‌మార్ట్‌ పీఈ 22 రెట్లు, టెస్కో 17 రెట్లు, కారెఫ్పోర్‌ 21 రెట్ల వద్ద ట్రేడవుతున్నాయి.



You may be interested

ఒడిదుడుకుల్లో బ్యాంకు నిఫ్టీ

Tuesday 2nd July 2019

బ్యాంకు నిప్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 31,414.65 వద్ద ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మార్కెట్‌ ర్యాలీలో భాగంగా క్రితం ముగింపు(31,372.20)తో పోలిస్తే 142 పాయింట్లు పెరిగి 31,431.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం మార్కెట్‌లో జరిగి అమ్మకాలతో ఇండెక్స్‌ తిరిగి నష్టాల్లోకి మళ్లింది. ఫలితంగా ఇండెక్స్‌ ఇంట్రాడే గరిష్టం

చార్టర్డ్‌ అకౌంటెంట్లు, వైద్యులకు ప్రధాని ప్రశంసలు

Tuesday 2nd July 2019

న్యూఢిల్లీ: సమాజంలో నిజాయితీ సంస్కృతికి పాటుపడుతున్న చార్టర్డ్‌ అకౌంటెంట్ల సేవలను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. చార్టర్డ్‌ అకౌంటెంట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘చార్టర్డ్‌ అకౌంటెంట్ల కష్టపడి పనిచేసే స్వభావం సమాజంలో నిజాయితీ సంస్కృతి, మెగురైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను ముందుకు తీసుకెళుతుంది’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్థిక సౌభాగ్యం ఫరిడవిల్లే విషయంలోనూ చార్టర్డ్‌ అకౌంటెంట్ల పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఇక వైద్యుల దినోత్సవం సందర్భంగా  సమాజాన్ని

Most from this category