రిలయన్స్ ర్యాలీ....8 శాతం అప్
By Sakshi

రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఆయిల్ రిఫైనింగ్, పెట్రో కెమికల్ విభాగాలలో సౌదీ ఆరామ్‌తో లక్ష కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కంపెనీ షేరు మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 6 శాతంగ్యాప్అప్తో మొదలై, క్షణాల్లో మరో 3 శాతం ఎగబాకి రూ.1,268 వద్ద గరిష్టస్థాయిని నమోదుచేసింది. ఉదయం 9.21 సమయానికి 7.99 శాతం పెరిగి రూ. 1,254.90 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో(శుక్రవారం) రూ.1,162.10 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం ట్రేడింగ్‌లో రూ. 1,233.15 వద్ద ప్రారంభమైంది. ‘వచ్చే 18 నెలలో కంపెనీని జీరో నికర రుణం కలిగిన కంపెనీగా తీర్చుదిద్దుతామని, వచ్చే కొన్నేళ్లలో బోనస్‌లు, డివిడెండ్లు అధికంగా పంచనున్నామని ఆర్ఐఎల్ 42 వ ఏజిఎం సమావేశంలో కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ముకేష్ అంబానీ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం 5.32 లక్షల కోట్ల విలువ కలిగిన ఆర్ఐఎల్ ఆయిల్ టూ కెమికల్స్(ఓటీసీ) ఎంటర్ప్రైజ్లో సౌదీ ఆరామ్కోకు 20 శాతం వాటా దక్కనుంది. సౌదీ ఆరామ్కో, ఆర్ఐఎల్ ఓటీసీలో రూ. 1.06 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఒకే కంపెనీలోకి వచ్చిన విదేశి ప్రత్యక్ష పెట్టుబడులలో(ఎఫ్‌డీఐ) ఇదే అతి పెద్దది కావడం గమనార్హం.
‘ఆర్ఐఎల్ స్టాక్ సానుకూలంగా కదిలే అవకాశం ఉంది. షార్ట్ కవరింగ్ ఉంటే పెరుగుదల అధికంగా ఉంటుంది’ అని కెఆర్ చోక్సి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్ దేవెన్ చోక్సీ అన్నారు. గత ఏడాది జులైలో జరిగిన ఏజిఎం నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ స్టాకు విలువ 20 శాతం పెరిగింది. ఇదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 5 శాతం లాభడడం గమనార్హం. అతి పెద్ద అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్లను ఆకర్షించి రూ. 1.25 లక్షల కోట్లను సమీకరించే లక్ష్యంతో ఆర్ఐఎల్ తన టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులను రెండు వేరువేరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్టులుగా విడదీసింది. ఆర్ఐఎల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్సియల్ ఇన్వెస్ట్మెంట్ల కోసం వాల్యు అన్లాకింగ్ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని దీని ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాలెన్స్ షీట్ నిర్వహిస్తున్న కంపెనీగా మారనున్నామని ఏజిఎం మీటింగ్‌లో అంబానీ తెలిపారు. ఆర్ఐఎల్ వినియోగధారిత వ్యాపారలైన రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌ను వచ్చే ఐదేళ్లలో మార్కెట్లో నమోదు చేయనున్నామని అన్నారు.
You may be interested
మంగళవారం వార్తల్లోని షేర్లు
Tuesday 13th August 2019వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు అలహదాబాద్ బ్యాంక్:- అన్ని రకాల వడ్డీరేట్లపై ఎంసీఎల్ఆర్ రేట్లను 15నుంచి 20శాతం తగ్గించింది. ఐఆర్బీ ఇన్ఫ్రా:- తన అనుబంధ సంస్థ ముంబైలోని పూణే ప్రాజెక్ట్‌ను నిర్ణీత సమయం(ఆగస్ట్ 09)లో పూర్తి చేసినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. సింటెక్స్ ప్లాస్టిక్:- తన అనుబంధ సంస్థ సింటెక్స్ ఎన్పీ సీఎఎస్ సంస్థలో మొత్తం ఈక్విటీని వాటాను ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
పాజిటివ్ ప్రారంభం
Tuesday 13th August 2019అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌తో ప్రపంచ మార్కెట్లు క్షీణించినా, భారత్ సూచీలు మాత్రం మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 37.775 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11.3340 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ఇన్వెస్టర్లకు కేంద్రం పలు పన్ను రాయితీలు ప్రకటించవచ్చన్న అంచనాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్...సౌదీ అరామ్కోతో రూ. లక్ష కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించడం వంటి అంశాలు ఇక్కడి మార్కెట్లు లాభాలతో