News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా...

Friday 17th January 2020
Markets_main1579251593.png-30993

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించనుంది. ఈ క్యూ3లో కంపెనీ నికరలాభం 10-14శాతం వృద్ధిని సాధించవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రిటైల్, టెలికాం వ్యాపారాల పనితీరు మెప్పించవచ్చు. పెట్రోకెమికల్స్‌ వ్యాపారం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. డిసెంబర్‌ క్వార్టర్‌లో రిఫైనింగ్ మార్జిన్లు 9.2-9.6డాలర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

జేఎం ఫైనాన్సియల్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు:-
త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం స్వల్పంగా 0.8శాతం తగ్గి రూ 1.51లక్షల కోట్లను నమోదు చేస్తుంది. వార్షిక ప్రాతిపదికన నికరలాభంతో 14శాతం వృద్ధి చెంది రూ.11,710 కోట్లకు ఆర్జించవచ్చు. నికర లాభం కార్వర్ట్‌ టు క్వార్టర్‌ 4శాతం పెరుగుతుంది. క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో రిఫైనరీ మార్జిన్ల సరాసరి 9.4-9.6 డాలర్లుగా ఉంటుంది. వినియోగదారుల నుండి ఇంటర్‌కనెక్ట్‌ ఛార్జీల రికవరీ, డిసెంబర్‌ను టారీఫ్‌ల పెంపుతో యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ కాస్ట్‌(ఏఆర్‌పీయూ) పెరుగుదల కారణంగా టెలికాం వ్యాపార రంగానికి చెందిన రిలయన్స్‌ జియో ఎబిటా 12-14శాతం వరకు పెరుగుతుంది. 

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ అంచనాలు:- 
ఈ క్యూ3లో వార్షిక ప్రాతిపాదిక కంపెనీ నికరలాభం 9.6 శాతం వృద్ధి చెంది రూ.11380 కోట్లను సాధిస్తుంది. ఎబిటా 6శాతం పెరిగి రూ.22,600 కోట్లకు చేరుకుంటుంది. వార్షిక ప్రాతిపాదిక పెట్రోకెమికల్‌ వ్యాపార ఎబిటా 17.9శాతం క్షీణించి రూ.6,750 కోట్లుగా నమోదుకావచ్చు. రీటైల్‌  వ్యాపార ఎబిటా 49.4శాతం పెరిగి రూ.2,260 కోట్లను, టెలికాం వ్యాపార రంగ ఎబిటా 55.7శాతం పెరిగి రూ.3,690 కోట్లను ఆర్జింవచ్చు.

ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు:-
కన్సాలిడేషన్‌ ప్రాతిపదికన డిసెంబర్‌లో కంపెనీ నికరలాభం 11.6శాతం వృద్ధి చెంది రూ.11,400కోట్లను సాధింవచ్చు. అధిక రీఫైనరీల కారణాంగా పెట్రోకెమికల్స్‌ ఎబిటా 22.6శాతం పతనం కావచ్చు.



You may be interested

మొబైల్‌ టెలికం జోష్‌- బ్యాంక్స్‌ వీక్‌

Friday 17th January 2020

ఎయిర్‌టెల్‌, ఆర్‌ఐఎల్‌ దూకుడు కుప్పకూలిన వొడాఫోన్‌ ఐడియా  భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ పతనం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, యస్‌ బ్యాంక్‌ డీలా ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ నేలచూపు సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిలపై టెలికం కంపెనీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో మొబైల్‌ టెలికం, బ్యాంకింగ్‌ రంగ కౌంటర్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో ద్వారా మొబైల్‌ సర్వీసులను అందిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లకు ఓవైపు డిమాండ్‌

26 నెలల గరిష్టానికి ఎయిర్‌టెల్‌

Friday 17th January 2020

ఏజీఆర్‌ రివ్యూ పిటీషన్‌ సుప్రీం కోర్టుకు కొట్టివేసిన నేపథ్యంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 26నెలల గరిష్టస్థాయిని అందుకుంది. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో అధిక భాగం మార్కెట్‌ వాటాను దక్కించుకుంటుందనే అంచనాలు షేరు ర్యాలీకి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో​కంపెనీ షేరు రూ.470.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు

Most from this category