News


అడాగ్‌ గ్రూప్‌ షేర్ల ర్యాలీ

Thursday 1st August 2019
Markets_main1564643083.png-27473

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., అనిల్‌ అంబానీకి గ్రూప్‌నకు (అడాగ్‌ గ్రూప్‌) చెందిన రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ పవర్‌ షేర్లు గురువారం లాభాల బాట పట్టాయి. రిలయన్స్‌ ఇన్ఫ్రాటెల్‌ 10.50శాతం పెరగ్గా, రిలయన్స్‌ పవర్‌ షేర్లు 5.50శాతం ర్యాలీ చేశాయి. 
రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- నేడు ఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.47.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్ల ఈ షేర్ల కొనుగోళ్లకు మద్దతివ్వడంతో ఒకదశలో దాదాపు 10.50శాతం లాభపడి రూ.52.10ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.11:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.47.15)తో పోలిస్తే 7.50శాతం వరకు లాభపడి రూ.50.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.37.25లు రూ.489.55లుగా నమోదయ్యాయి.
రిలయన్స్‌ పవర్‌:- నేడు ఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.3.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌లో విద్యుత్‌ రంగ షేర్లు ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 7శాతం ర్యాలీ చేసి రూ.3.80ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గత ముగింపు(రూ.3.55)తో పోలిస్తే 4.25శాతం లాభంతో రూ.3.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు నెలరోజుల్లో దాదాపు 13.50శాతం వరుకు క్షీణించింది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.2.95లు రూ.39.30లుగా నమోదయ్యాయి. 



You may be interested

మరో 5 శాతం పతనమైతే ఆర్‌ఐఎల్‌ కొనొచ్చు!

Thursday 1st August 2019

షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమాంగ్‌ జాని సూచన రెండు నెలలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ప్రధాన సూచీల కన్నా మంచి ప్రదర్శన చూపిందని షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమాంగ్‌ జాని చెప్పారు. తాజాగా విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు. కంపెనీ కొత్త వ్యాపారాలు అదరగొడుతున్నాయన్నారు. కంపెనీ కోర్‌ బిజినెస్‌ మాత్రం సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. ఇందుకు మందగమనమే ప్రధాన కారణమన్నారు. పెట్‌కెమ్‌, రిఫైనింగ్‌ వ్యాపారాల్లో ఇప్పటికిప్పుడే వృద్ది రాకపోవచ్చన్నారు. ప్రస్తుతం

నష్టాల్లో ప్రభుత్వ బ్యాంకింగ్‌ షేర్లు

Thursday 1st August 2019

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 11.42 సమయానికి 1.37 శాతం నష్టపోయి 2,718.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో బ్యాంక్‌ ఇండియా 2.56  శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 2.14  శాతం, పీఎన్‌బీ 1.95 శాతం, ఎస్‌బీఐ 1.87 శాతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ 1.56 శాతం, కెనరా బ్యాంక్‌ 1.35 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 1.24 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 0.95 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌

Most from this category