News


రిలయన్స్‌ పాజిటివ్‌.... హెచ్‌డీఎఫ్‌సీ నెగిటివ్‌

Monday 22nd July 2019
Markets_main1563768757.png-27212

గతవారం చివర్లో క్యూ1 ఫలితాలను ప్రకటించిన హెవీవెయిటేజీ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో మిశ్రమంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను నమోదుచేయడం‍తో రిలయన్స్‌ షేర్లు  0.65శాతం లాభంతో రూ. 1256.95 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలో ఈ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 1.35శాతం ర్యాలీ చేసి రూ.1265.80 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.9:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.1249)తో పోలిస్తే 0.75శాతం లాభంతో రూ.1258.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1017.00  రూ.1413.75లుగా నమోదయ్యాయి. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు:- ఫలితాలు అంచనాలకు అందుకున్నటికీ.., షేరు 1శాతం నష్టంతో రూ.2353.00 ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు 2శాతం నష్టపోయి రూ 2311.00 కనిష్టానికి పతనమైంది.  ఉదయం గం.9:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.2375.95)తో పోలిస్తే 2.35శాతం నష్టంతో రూ.2315.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1884.40 రూ.2502.90లుగా నమోదయ్యాయి. 



You may be interested

68.91 వద్ద రూపీ ప్రారంభం

Monday 22nd July 2019

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాల మధ్య బ్యాంకులు, దిగుమతిదారులు అమెరికన్ కరెన్సీని కొనుగోలు చేయడంతో  రూపాయి సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 10 పైసలు బలహీనపడి 68.91 వద్ద ప్రారంభమైంది. ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు అమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఎఫ్ఐఐలు ఈక్విటీ విభాగంలో 110 కోట్ల డాలర్ల అమ్మకాలు జరిపారు. రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం  16 పైసలు బలపడి 68.81 వద్ద ముగిసింది. ఈ

బ్రిటన్‌ ట్యాంకర్‌ స్వాధీనం..పెరిగిన చమురు

Monday 22nd July 2019

గత వారం చివర్లో ఇరాన్ మిలటరీ, బ్రిటిష్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో  చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్‌  51 సెంట్లు లేదా 0.8 శాతం పెరిగి బ్యారెల్కు 62.98 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.3 శాతం లేదా 15 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు 55.78 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత వారం బ్రెంట్‌ క్రూడ్‌ 6 శాతం, డబ్యూటీఐ

Most from this category