News


టీసీఎస్‌ వెనక్కు.. రిలయన్స్‌ ముందుకు..

Friday 16th November 2018
Markets_main1542359738.png-22099

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా టీసీఎస్‌ను మళ్లీ వెనక్కు నెట్టింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు శుక్రవారం 2 శాతానికిపైగా పెరిగింది. దీంతో రిలయన్స్‌.. టీసీఎస్‌ను వెనక్కు నెట్టి అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మధ్యాహ్నం 2:34 సమయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2.74 శాతం పెరుగుదలతో రూ.1,126 వద్ద ట్రేడవుతోంది. అప్పుడు కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7,13,971 కోట్లుగా ఉంది. అదే సమయంలో టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7,02,821 కోట్లుగా నమోదయ్యింది. టీసీఎస్‌ షేరు 0.14 శాతం పెరుగుదలతో రూ.1,875 వద్ద ట్రేడవుతోంది. 
ముకేశ్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆగస్ట్‌ 23న రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను సాధించి భారత్‌లో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ గల కంపెనీగా రికార్డ్‌ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా రికార్డ్‌ సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేరు ధర రూ.1,263 వద్ద ట్రేడవుతున్నప్పుడు కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు అధిగమించింది. తర్వాత రిలయన్స్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వెనక్కు నెట్టి అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టీసీఎస్‌ షేరు ధర రూ.2,096 వద్ద ఉన్నప్పుడు కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.8 లక్షల కోట్లను అధిగమించింది. అయితే తర్వాత ఇరు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8 లక్షల కోట్ల మార్క్‌ దిగువకు వచ్చేసింది. అయితే రిలయన్స్‌ షేరు బాగా పడిపోవడంతో టీసీఎస్‌ కన్నా చాలా వెనకకు వెళ్లింది. అయితే శుక్రవారం షేరు ర్యాలీ చేయడంతో రిలయన్స్‌ మళ్లీ టీసీఎస్‌ను వెనక్కు నెట్టి అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 



You may be interested

వెలుగులో టెలికాం షేర్లు

Friday 16th November 2018

టెలికం రంగ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల మోత మోగిస్తున్నాయి. బీఎస్‌ఈలో టెలికాం షేర్లకు సూచీగా ఉన్న ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ టెలికాం సూచీ ఇంట్రాడేలో 5.09 శాతం లాభపడింది. టెలికాం రంగంలోని ప్రధాన షేర్లైన ఐడియా, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, టాటా కమ్యూనికేషన్స్‌, జీపీటీఎల్‌, టీటీఎంఎల్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు దాదాపు 13శాతం లాభపడ్డాయి. అత్యధికంగా ఐడియా సెల్యూలార్‌ 15శాతం చేసింది. ఎయిర్‌టెల్‌ 8.50శాతం లాభపడి నెలన్నర గరిష్టానికి చేరుకుంది. జీపీటీఎల్‌ హాత్‌వే

దిగ్గజ బ్రోకింగ్‌ సంస్థలు మెచ్చిన 5 షేర్లు

Friday 16th November 2018

ముంబై: సీఎల్‌ఎస్‌ఏ, మోర్గాన్‌ స్టాన్లీ వంటి అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు దేశీ మార్కెట్‌లోని ఐదు షేర్లను కొనుగోలుచేయవచ్చని సిఫార్సు చేశాయి. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. లెమన్‌ ట్రీ హోటల్స్: ప్రీమియం వాల్యుయేషన్స్‌ సమంజసంగా ఉన్నందున్న ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. రూ.87 టార్గెట్‌ ధరను ఇచ్చింది. అసెట్‌ లైట్‌ మోడల్‌ ఆధారంగా వృద్ధి బాటా మెరుగ్గా ఉంటుందనే అంచనాను వెల్లడించింది. ఐషర్‌ మోటార్స్‌: మార్కెట్‌లోకి నూతనంగా జావా

Most from this category