రిలయన్స్ రిఫైనింగ్ లాభాలను జియో అధిగమిస్తుంది
By Sakshi

‘రిలయన్స్ జియో లాభాలు, రిలయన్స్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ పాలిమర్ వ్యాపారాల లాభాలను అధిగమిస్తుంది. దీని ప్రభావం కంపెనీ షేరు ధరలో కనిపిస్తుంది’ అని ఎండీ, కేఆర్ చోక్సి, దేవన్ చోక్సి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో..
రిలయన్స్ జియో హవా..
రిలయన్స్ ఇండస్ట్రీస్ వినియోగధారిత వ్యాపారాలైన జియో, రిటైల్ ముందుకెళ్లేకొద్ది మరింతగా లాభాలను తెచ్చిపెడతాయి. రిలయన్స్ జియో అందించే లాభాలు 2021 లో, ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ప్రధాన వ్యాపారాలైనా రిఫైనింగ్, పెట్రోకెమికల్ పాలిమర్ వ్యాపారాల లాభాలను అధిగమిస్తాయి.
ఈ రెండు విభాగాలలో వచ్చే లాభాలను జియో అధిగమిస్తుందని అంచనా వేస్తున్నాం. ముందుకెళ్లే కొద్ది జియో, రిలయన్స్ రిటైల్ కలిసి మంచి రిటర్న్ లిస్తాయి. వీటి సానుకూల ప్రభావాన్ని ప్రస్తుతం రిలయన్స్ షేరు ధరలో చూడొచ్చు. దీంతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తుల ద్వారా నిధులను సమీకరిస్తుండడం వలన కూడా ఈ కంపెనీ షేరు విలువ కొత్త గరిష్ఠాలను చేరుకుంటోంది. రిలయన్స్ ఇప్పటికే రిటైల్ ఇంధన విభాగంలో బీపీతో భాగస్వామ్యమై పనిచేస్తుంది. తాజాగా రిఫైనింగ్ విభాగంలో కూడా సౌదీ ఆరాంకోతో కలిసి పనిచేయనుంది. ఈ విధంగా రిలయన్స్ తన ఆస్తుల ద్వారా నిధులను సమీకరించడం, కంపెనీ బ్యాలెన్స్ షీట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక పద్ధతి ప్రకారం మోనిటైజింగ్ పక్రియను చేపడుతోంది. వచ్చే 12-24 నెలల్లో జియో, రిటైల్ వ్యాపారాలు కూడా ఈ పక్రియలో భాగం కావచ్చు.
రిలయన్స్ జియో, రిటైల్ ఎబిట్టా పై పైకి..
రిలయన్స్ వినియోగధారిత వ్యాపారాల లాభదాయకత వృద్ధి చెందుతుందని అంచనావేస్తున్నాం. ఈ వ్యాపారాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కంపెనీ ఇప్పటికే ఏర్పాటు చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో వీటి పరిమాణం కూడా పెరిగే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం ప్రస్తుతం జియో ఎబిట్టా 40 శాతం వద్ద ఉంది. ముందుకెళ్లే కొద్ది మౌలిక సదుపాయాల పరిమాణం పెరిగితే ఇది 50-55 శాతం వరకు వృద్ధి చెందవచ్చు.
గతంలో వినియోగ రంగానికి చెందని కంపెనీ, తర్వాత వినియోగ రంగంలోకి మారితే ఆ కంపెనీ పీఈ విలువ కూడా మారుతుంది. కంపెనీ వినియోగ ఆధారిత వ్యాపారాల ఆదాయం, లాభాలు అధికంగా ఉన్నప్పుడు ఇటువంటి దృక్పథం ఏర్పడుతుంది. అందువలన కంపెనీ పే బ్యాక్ పిరియడ్ కూడా పుంజుకుంటుందని అంచనావేస్తున్నాం. రిలయన్స్ సాంప్రదాయ వ్యాపారం 12-14 రెట్లు వద్ద ట్రేడవుతోంది. అదే వినియోగధారిత వ్యాపారాలు 45-55 శాతం ఎబిట్టాను సృష్ఠిస్తున్నాయి. ఇవి అధిక మొత్తంలో పే బ్యాక్ పిరియడ్ నగదును ఏర్పాటుచేయగలవు. అందువలన పీఈ కూడా గరిష్ఠాల వైపు మరలుతుంది. వినియోగాధారిత వ్యాపారాల వృద్ధి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది కంపెనీ పీఈ 25 స్థాయి చేరుకోడానికి సహాయపడుతుంది.
You may be interested
ప్రాఫిట్ బుకింగ్‌కు ఇన్వెస్టర్ల మొగ్గు
Friday 29th November 2019డిసెంబర్ సీరిస్‌ను సూచీలు నష్టాలతో ఆరంభించాయి. జీడీపీ గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపారు. జీడీపీ ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోతున్న అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అయితే ఇది స్వల్పకాలిక విరామమేనని, మిడ్- లాంగ్ టర్మ్‌కు సూచీల మూడ్ పాజిటివ్‌గానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఐఐ నిధుల రాకడ, అంతర్జాతీయ పరిణామాలు పాజిటివ్‌గా ఉండడం.. మార్కెట్‌పై పాజిటివ్ ప్రభావం కొనసాగిస్తాయని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. లిక్విడిటీ
కోటక్ సెక్యూరిటీస్ టాప్ 3 సిఫార్సులు
Friday 29th November 2019ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు, పీఎస్బీల్లో ఎస్బీఐ, ఎన్బీఎఫ్సీల్లో బజాజ్ ఫైనాన్స్ షేరుపై పాజిటివ్‌గా ఉన్నామని కోటక్ సెక్యూరిటీస్ ప్రతినిధి సంజీవ్ జర్బాడే చెప్పారు. కార్పొరేట్ బ్యాంక్స్‌లో ఎన్పీఎల్ బలహీనంగా ఉన్నందున వీటిపై పాజిటివ్‌గా ఉన్నామన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐలు ఇటీవల మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. రాబోయే ఏడాదికూడా వీటి నుంచి మంచి ఫలితాలు ఆశించవచ్చన్నారు. వాహనాల ఫైనాన్సింగ్ చేసే ఎన్బీఎఫ్సీలు ఇకపై కొంత నెగిటివిటీ చూడవచ్చన్నారు. వాహన విక్రయాల్లో