News


రిలయన్స్‌ ఇన్ఫ్రా 7 శాతం క్రాష్‌

Thursday 8th August 2019
Markets_main1565244848.png-27634

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో 5.50శాతం ర్యాలీ చేసిన రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ షేర్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఈ కంపెనీ షేర్లు నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.50.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభం నుంచే నుంచే ఇన్వెస్టర్లు ఈ షేర్లకు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు ఒకదశలో 9శాతం నష్టపోయి రూ.46.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:15ని.లకు షేరు కిత్రం ముగింపు(రూ.50.25)తో పోలిస్తే 1శాతం నష్టంతో రూ.47.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.37.25లు రూ.489.55గా నమోదయ్యాయి. అనిల్‌ అంబాకి చెందిన అడాగ్‌ గ్రూప్‌ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ విద్యుత్‌రంగంలో సేవలు అందిస్తోంది.



You may be interested

10750 కోల్పోతే 10450 పాయింట్లకు నిఫ్టీ!

Thursday 8th August 2019

నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకంతో వచ్చిన పతనం కొంత విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నిఫ్టీ 10800- 10900 పాయింట్ల మధ్య కొన్ని రోజులుగా కన్సాలిడేట్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో కన్సాలిడేషన్‌ నెగిటివ్‌గా ముగిసి నిఫ్టీ మరోమారు డౌన్‌ట్రెండ్‌లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ దేశీయ మార్కెట్లు వాల్యూషన్‌ ఎక్కువగానే ఉందని, దీనికితోడు ఎకానమీలో చురుకుదనం లేకపోవడం నెగిటివ్‌ సెంటిమెంట్‌ను పెంచుతోందని చెబుతున్నారు. నిఫ్టీ

హైదరాబాద్‌లో బ్రిటన్ టెక్నాలజీ హబ్‌

Thursday 8th August 2019

దేశవ్యాప్తంగా నాలుగు ఏర్పాటు బ్రిటన్ హై కమిషనర్ సర్‌ డొమినిక్ వెల్లడి ‍చెన్నై: భారతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు, ఇరు దేశాల్లోను పెట్టుబడులను ప్రోత్సహించేందుకు  ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత్‌లో బ్రిటన్ హై కమిషనర్ సర్ డొమినిక్ ఆస్కిత్ తెలిపారు. ఇందులో భాగంగా త్వరలో నాలుగు భారతీయ నగరాల్లో టెక్ హబ్‌లు (టెక్నాలజీ హబ్‌) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో వీటిని నెలకొల్పనున్నట్లు చెప్పారు. రెండు

Most from this category