News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ పోటాపోటీ..!

Wednesday 13th November 2019
Markets_main1573629599.png-29555

స్వల్ప హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్న బుధవారంనాటి మార్కెట్లో అధిక వెయిటేజీ కలిగి, భారత్‌ మార్కెట్లో అత్యధిక మార్కెట్‌ కేపిటలైజేషన్‌ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ షేర్లు పోటాపోటీగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన ఇండెక్స్‌ అయిన నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని టాప్‌-5 గెయినర్లలో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తరువాతి స్థానాల్లో ఈ రెండు షేర్లు  ట్రేడ్‌ అవుతున్నాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్‌కు నిఫ్టీలో వెయిటేజీ తక్కువకాగా, అధిక వెయిటేజి కలిగిన  రిలయన్స్‌, టీసీఎస్‌ షేర్లు చెరో 3శాతం ర్యాలీ చేయడం ద్వారా సూచీలు పతనంకాకుండా నిలపగలిగాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి టీసీఎస్‌ కౌంటర్లో 18.70లక్షల ట్రేడింగ్‌ పరిమాణం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 62.10 లక్షల ట్రేడింగ్‌ పరిమాణం జరిగింది. టీసీఎస్‌ షేరు క్రితం ముగింపు(రూ.2,100.95)తో పోలిస్తే 3.10శాతం లాభంతో రూ.2,165.85 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు క్రితం ముగింపు(రూ.1,430.00)తో పోలిస్తే 2.38శాతం లాభంతో రూ.1,461.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ఈ ధరల వద్ద  టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.801,922.14కోట్లుండగా, రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.916,642.39 కోట్లుగా ఉంది. నేడు నిఫ్టీ ఇండెక్స్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 29.88 పాయింట్లను, టీసీఎస్‌ 15.65 పాయింట్లను కాంట్రిబ్యూట్‌ చేశాయి.  బ్రిటానియా క్యూ2 ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో  ఈ కంపెనీ షేరు నేడు నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు నిఫ్టీకి 4 పాయింట్లను జతచేసింది. 

ఇక ఇదే సమయానికి నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,909.10 వద్ద, సెన్సెక్స్‌ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 40,346.62 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

ఆర్‌బీఐకి ఉల్లిఘాటు తగిలేనా?!

Wednesday 13th November 2019

ద్రవ్యోల్బణం 4 శాతం దాటే అవకాశం ఆహార పదార్ధాల ధరల పెరుగుదలే కారణం  ఉల్లి ధరల ఘాటుకు ఆర్‌బీఐ పెట్టుకున్న ద్రవ్యోల్బణ టార్గెట్‌ కకావికలం కానుందా? అవునని అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే ద్రవ్యోల్బణం టార్గెట్‌కు అటుఇటు అయినంత మాత్రాన ఆర్‌బీఐ తక్షణమే తన మానిటరీ పాలసీలో మార్పులు చేయకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 4.35 శాతం ఉండొచ్చని బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో 33 మంది ఎకనమిస్టులు అంచనా వేశారు. ఇదే నిజమైతే

4రోజుల నష్టాల తరువాత లాభాల్లోకి పసిడి

Wednesday 13th November 2019

నాలుగు రోజుల వరుసగా నష్టాల ముగింపు అనంతరం బుధవారం ఉదయం సెషన్‌లో లాభాల బాట పట్టింది. గత రెండు రోజులుగా 3నెలల కనిష్టం వద్ద ట్రేడైన పసిడి ధర బుధవారం లాభపడింది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 6.50డాలర్ల పెరిగి 1,460.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో చైనాతో వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో

Most from this category