News


రిలయన్స్‌ అప్‌... ఎయిర్‌టెల్‌, ఐడియా డౌన్‌..!

Friday 22nd November 2019
Markets_main1574399301.png-29780

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఈ కంపెనీ షేరు 2శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.1543.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జియో, రిటైల్‌ వ్యాపార రంగాల అత్యుత్తమ ప్రదర్శన అప్‌సైడ్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తాయని హెచ్ఎస్‌బీసీ తన నివేదికలో తెలిపింది. అలాగే రిలయన్స్‌ కన్జూ‍్యమర్‌ వ్యాపారం కూడా కంపెనీ వృద్ధికి తోడ్పతుందని తెలిపింది. ప్రస్తుత ధర వద్ద షేరు వ్యాల్యూవేషన్‌ ఆకర్షణీయంగా ఉండటంతో షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడం జరిగింది. స్వల్ప కాలికానికి షేరు టార్గెట్‌ ధరను రూ.1,600లుగానూ, ధీర్ఘకాలిక టార్గెట్‌ను ధర రూ.1,800 నిర్ణయించడమైంది. బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌ పెంపుతో షేరు ఇంట్రాడేలో 2శాతం లాభపడి రూ.1569.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.9:50లకు షేరు క్రితం ముగింపు ధర (రూ.1537.25)తో పోలిస్తే 1.50శాతం లాభంతో రూ.1559.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది రూ.1017.00లు, రూ.1571.85లుగా ఉన్నాయి.
రెండో రోజూ నష్టాల్లో టెలికాం షేర్లు:-
ఇక టెలికాం రంగానికి చెందిన ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియ షేర్ల పతనం రెండో రోజూ కొనసాగతుంది. ఈ రంగాలకు ఊరటనిస్తూ  కేంద్రం తీసుకున్న నిర్ణయం సెంటిమెంట్‌ను బలపరడచంతో విఫలమైంది. ప్రభుత్వ ప్రతిపాదన కేవలం చెల్లింపు వాయిదాకే పరిమితమైంది. ఏక్యూఆర్‌ మాఫీ మాత్రమే టెలికాం రంగాన్ని సంక్షోభం నుంచి గట్టించలగలదు. ఈ అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేకపోవడంతో టెలికాం షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎయిర్‌టెల్‌ అరశాతం నష్టంతో రూ.424.90 వద్ద, వోడాఫోన్‌ ఐడియా షేరు 1శాతం పతనమై రూ.6.58 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

మాటలు కాదు..ఫిర్యాదును పరిష్కరించండి: మోహన్‌దాస్‌ పాయ్‌

Friday 22nd November 2019

విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదును ఎదుర్కొన్న కంపెనీలు, ఆ ఫిర్యాదును పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయాలి కానీ దేవుడు కూడా మార్చలేడంటూ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించకూడదని ఇన్ఫోసిస్‌ మాజీ ఉద్యోగి టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ గురువారం అన్నారు. కాగా ఇన్ఫోసిస్‌పై రెండవ సారి విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదుపై వచ్చిన తర్వాత మోహన్‌ దాస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది మేం చేశాం. ఆ పద్ధతిని అనుసరిస్తున్నాం’ అని కొన్ని వాఖ్యలు చేయడం కాదు. కంపెనీ ఆరోపణలపై ప్రజలు

పండుగ సీజన్‌ ముగిసింది.. ఆటో షేర్లు కొనొచ్చా?

Friday 22nd November 2019

ఆటో కంపెనీల విక్రయాలకు జోష్‌నిచ్చే పండుగ సీజన్‌ ముగిసింది. దీంతో మరో రెండు మూడు నెలల పాటు నెలవారీ ఆటో విక్రయాలు సాధారణంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. ఆటో అమ్మకాల జోరు తగ్గే నేపథ్యంలో ఆటో కంపెనీల షేర్లపై నిపుణుల అభిప్రాయాలు మాత్రం బుల్లిష్‌గానే ఉన్నాయి. గతాన్ని పరికిస్తే ఆటో స్టాకులు పండుగ సీజన్‌ అనంతరం ఆటో షేర్ల జోరు కొనసాగడం కనిపిస్తుంది. నవంబర్‌, డిసెంబర్‌లో నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ ఆటో

Most from this category