News


నెలన్నర గరిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.!

Friday 18th January 2019
Markets_main1547805223.png-23669

మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి మూడో క్వార్టర్‌ ఫలితాలను వెల్లడించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నెలన్నర గరిష్టాన్ని తాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ షేర్లు రూ.1,148.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నటి మార్కెట్‌ ముగింపు వెల్లడించిన క్యూ3 ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడంతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే షేర్లు లాభాల బాట పట్టాయి. ఇంట్రాడేలో ఒకానొక దశలో దాదాపు 5శాతం లాభపడి రూ.1,189.90ల గరిష్టాన్ని తాకింది. నవంబర్‌ 30వ తేదీ అనంతరం షేరు ఇంతస్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. మధ్యాహ్నం గం.3:00లకు రిలయన్స్‌ షేరు గతముగింపు(రూ.1134.45)తో పోలిస్తే 4.50శాతం లాభపడి రూ.1,183.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.871లు, రూ.1,329లుగా నమోదయ్యాయి.



You may be interested

వడ్డీ రేట్ల తగ్గింపు సమయంలో డెట్‌ ఫండ్స్‌ బెస్ట్‌

Friday 18th January 2019

ఆర్‌బిఐ కీలక రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్న వేళ   డెట్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం ద్వారా తీరైన రిటర్న్స్ పొందవచ్చని మార్కెట్‌ పండితులు సూచిస్తున్నారు. డెట్‌ ఫండ్స్‌ను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సెక్యూరిటీలు అనికూడా అంటారు. వీటిల్లో సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌, కార్పొరేట్‌బాండ్స్‌, కమర్షియల్‌పేపర్స్‌, గవర్నమెంట్‌ బాండ్స్‌.. ఇలా పలు రకాలున్నాయి. ఈ ఫండ్స్‌లో ప్రధానంగా వడ్డీరేట్ల రిస్కు, క్రెడిట్‌ రిస్క్‌ అని రెండు రకాల రిస్కులుంటాయి. వడ్డీరేట్లకు, బాండ్ల మార్కెట్‌ విలువకు విలోమానుపాత

ఈ ఏడాది వెనుకడుగే!

Friday 18th January 2019

భారత మార్కెట్‌పై సీఎల్‌ఎస్‌ఏ అంచనా వచ్చే ఆరునెలల్లో దేశీయ మార్కెట్లలో నిధుల ప్రవాహం సన్నగిల్లుతుందని, అందువల్ల మార్కెట్లు మందకొడిగా తయారవుతాయని సీఎల్‌ఎస్‌ఏ వ్యూహకర్త మహేశ్‌ నండూర్కర్‌ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈక్విటీలపై ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయ మార్కెట్లలో 8- 10 శాతం పతనం వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయన్నారు. ఈ ఏడాదిని నిఫ్టీ పాజిటివ్‌గా ముగిస్తే సంతోషించాల్సినవిషయమని, ఈ సంవత్సరం ఎలాగైనా సూచీల్లో డౌన్‌ట్రెండ్‌ తప్పకపోవచ్చని ఆయన చెప్పారు.బడ్జెట్‌

Most from this category