News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్యాప్‌డౌన్‌

Monday 23rd December 2019
Markets_main1577073883.png-30376

ప్రభుత్వంతో వివాద వార్తల నేపథ్యంలో ఇంధన రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) కౌంటర్‌ బలహీనంగా ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల సమయానికి బీఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 2 శాతం క్షీణించి రూ. 1570 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1555 వరకూ నీరసించింది.

కారణమేమిటంటే...
పన్నా ముక్తా తపతి చమురు గ్యాస్‌ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభాలలో 350 కోట్ల డాలర్ల(రూ. 24500 కోట్లు)ను మధ్యవర్తిత్వ బకాయిలను చెల్లించవలసి ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్న వార్తలతో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఈ బకాయిలను చెల్లించకముందే చమురు, కెమికల్స్‌ బిజినెస్‌లో 20 శాతం వాటాను సౌదీ అరామ్‌కో కంపెనీకి రిలయన్స్‌ విక్రయిం‍చినట్లు ప్రభుత్వం వివరించింది. ఈ వాటాను ఆర్‌ఐఎల్‌ 15 బిలియన్‌ డాలర్లకు విక్రయించినట్లు  తెలియజేసింది. దీంతో ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. అయితే తాము బకాయిలు చెల్లించవలసిన అవసరంలేదంటూ ఆర్‌ఐఎల్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. 



You may be interested

షార్ట్‌టర్మ్‌ కోసం ఐదు ఐడియాలు!

Monday 23rd December 2019

స్వల్పకాలానికి మంచి రాబడినిచ్చే ఐదు రికమండేషన్లను యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అందిస్తోంది. 1. కెనెరాబ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 242. స్టాప్‌లాస్‌ రూ. 220. డైలీ చార్టుల్లో హయ్యర్‌హై, హయ్యర్‌ లో ఏర్పాటు చేస్తూ వస్తోంది. వీక్లీ చార్టుల్లో ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం షేరు ధర కీలక 20, 50, 100 డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతూ బలంగా ఉంది.  2. ఐసీఐసీఐ లొంబార్డ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1500. స్టాప్‌లాస్‌ రూ.

అవకాశం ఎక్కడ ఉన్నా అందిపుచ్చుకోవడమే..!

Monday 23rd December 2019

లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో వృద్ధి, లాభాలకు అవకాశం ఉన్న స్టాక్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసేవే మల్టీక్యాప్‌ ఫండ్స్‌. విడిగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌తో పోలిస్తే మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో రిస్క్‌ తక్కువ. అదే సమయంలో అచ్చమైన లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌తో పోలిస్తే మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో అస్థిరతలు ఎక్కువ. గత ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే రాబడులు ఉన్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లో అధిక శాతం స్టాక్స్‌ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. త్వరలో ఈ

Most from this category