News


రెండోరోజూ రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ షేర్ల ర్యాలీ

Wednesday 20th November 2019
Markets_main1574223399.png-29722

క్రితం సెషన్‌లో సూచీలకు లాభాల ముగింపునకు కారణమైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లోనూ శుభారంభం చేశాయి. రిలయన్స్‌ నిన్నటి ముగింపు(రూ.1510)తో పోలిస్తే 3శాతం లాభంతో 1555.05 వద్ద, ఎయిర్‌టెల్‌ 4.50శాతం పెరిగి రూ.426.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వచ్చే నెల నుంచి డేటా, టారీఫ్‌లను పెంచనున్నామని ప్రకటనతో టెలికాం షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేర్లు లాభాల ప్రారంభంతో ఉదయం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 50 పాయింట్లు లాభంతో 11990 వద్ద, సెన్సెక్స్‌ సూచీ 160 పాయింట్లు పెరిగి  40,628.73 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నిన్న మార్కెట్‌ ముగిసే సరికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3.5శాతం లాభంతో 1510, ఎయిర్‌టెల్‌ 7.50శాతం లాభంతో రూ.439 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 



You may be interested

పడిపోయిన రూపీ

Wednesday 20th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం సెషన్లో 12 పైసలు బలహీనపడి 71.83 వద్ద ప్రారంభమైంది. కాగా చమురు ధరలు తగ్గడంతోపాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ నష్టాల నుంచి కోలుకొని, చివరికి 13 పైసలు లాభపడి 71.71 వద్ద ముగిసింది. అధిక సరఫరా ఆందోళనలు పెరగడంతో గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. గత సెషన్‌లో డాలర్‌-రూపీ

కాంటినెంటల్‌ కాఫీ కొత్త రుచులు

Wednesday 20th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఇన్‌స్టంట్‌ కాఫీ దిగ్గజం సీసీఎల్‌ ప్రొడక్ట్స్ దిస్‌ పేరుతో నాలుగు రకాల త్రీ ఇన్‌ వన్‌ ప్రీమిక్స్‌ కాఫీ రుచులను ప్రవేశపెట్టింది. 22 గ్రాముల ప్యాక్‌ ధర రూ.20గా కంపెనీ నిర్ణయించింది. అయిదు ప్యాక్‌లు కొంటే ఒకటి ఉచితం. త్వరగా కాఫీ తయారు చేసుకునేలా ప్రీమిక్స్‌ రకాలకు రూపకల్పన చేశామని కంపెనీ కంజ్యూమర్‌ మార్కెటింగ్‌ హెడ్‌ ప్రీతమ్‌ పట్నాయక్‌ తెలిపారు. సీసీఎల్‌ ప్రొడక్ట్స్ కాంటినెంటల్‌ బ్రాండ్‌లో

Most from this category