News


ఆల్‌టైం ​గరిష్ఠానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Tuesday 29th October 2019
Markets_main1572326510.png-29198

షార్ట్‌పొజిషన్లు కవర్‌వుతుండడంతో పాటు, మొత్తంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై మార్కెట్‌ వర్గాలలో పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఉండడంతో ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం సెషన్‌లో కొత్త గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 10.43 సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు విలువ 1.95 శాతం లాభపడి రూ. 1462.00  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 1,434.25 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్లో రూ. 1,445.50 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమై, రూ. 1,467.65 వద్ద ఆల్‌టైం గరిష్ఠానికి చేరుకుంది. ఇటీవల ఈ కంపెనీ మార్కెట్‌క్యాప్‌ రూ. 9 లక్షల కోట్ల స్థాయిని టచ్‌చేసితిరిగి వెనక్కి వచ్చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ షేరు ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకడంతోపాటు,  మార్కెట్‌ క్యాప్‌ రూ. 909,097.07 కోట్లకు చేరుకోవడం గమనార్హం. 



You may be interested

11,700 పైకి నిఫ్టీ

Tuesday 29th October 2019

అటో, మెటల్‌ షేర్లకు విరివిరిగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్‌ ప్రారంభమైన గంటలోనే నిఫ్టీ ఇండెక్స్‌ 11700 స్థాయిని అందుకుంది. ఒకరోజు విరామం తర్వాత నేడు సెన్సెక్స్‌ 49 పాయింట్ల లాభంతో 39,300 వద్ద, నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 11,644 వద్ద మొదలయ్యాయి. దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలేవీ లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లల్లో నెలకొన్న సానుకూల సంకేతాల నేపథ్యంలో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు

టాటాస్టీల్‌ 7% అప్‌!

Tuesday 29th October 2019

టాటా స్టీల్‌ భుషణ్‌ స్టీల్‌ ఉత్పత్తి సెప్టెంబర్‌ త్రైమాసికంలో పెరగడంతో టాటా స్టీల్‌ ఉత్పత్తి ఇండియాలో పెరిగింది. అంతేకాకుండా అమ్మకపు పరిమాణం గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే మార్పులేనప్పటికి, గత త్రైమాసికంతో పోల్చుకుంటే పెరిగింది. ఫలితంగా ఈ కంపెనీ తన సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో మంచి సంఖ్యలను ప్రకటిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వీటితో పాటు టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటర్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే బాగుండడం,

Most from this category