News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ @ రూ.10లక్షల కోట్లు

Wednesday 20th November 2019
Markets_main1574233039.png-29729

ముకేశ్ అంబానీ సారథ్యంలోని  దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.10లక్షల కోట్లకు అతి చేరువులో ఉంది. రిలయన్స్‌ అనుబంధ టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’ త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారమే ఛార్జీల పెంపు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సెప్టెంబర్ లో కొత్తగా 69.83 లక్షల యూజర్లు జత కావడంతో జియో కస్టమర్ల సంఖ్య 35.55 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో తన ప్రత్యర్థి కంపెనీలైన ఎయిర్‌టెల్ 23.8 లక్షల యూజర్లను కోల్పోగా, సబ్‌స్క్రైబర్స్ సంఖ్య 32.55 కోట్లుగా ఉంది. వోడాఫోన్ ఐడియా 25.7 లక్షల చందాదారులను కోల్పోయి 37.24 కోట్లుగా ఉంది. జియో ఛార్జీల పెంపు ప్రకటన, యూజర్ల పెరుగుదల లాంటి సానుకూల వార్తలతో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నేటి ఉదయం సెషన్‌లో నిన్నటి ముగింపు(రూ.1509.80)లాభంతో పోలిస్తే 4.14శాతం లాభపడి రూ.1572.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరు సరికొత్త జీవికాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సైతం కొత్త రికార్డును సృష్టించింది. షేరు ఆల్‌టైం హై(రూ.1572.40) వద్ద మార్కెట్‌ క్యాప్‌ రూ.9.97లక్షల కోట్లకు ఎగిసింది. అంటే రూ.10లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌కు కేవలం రూ.3వేల కోట్ల దూరంలో ఉంది. ఇంట్రాడేలో షేరు రూ.1577.5 స్థాయిని అందుకున్నట్లైతే... కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఇదే జరిగితే దేశ కార్పోరేట్‌ చరిత్రలో తొలిసారిగా రూ.10లక్షల కోట్ల మార్కెట్‌క్యాప్‌ను అందుకున్న తొలికంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.10లక్షల కోట్ల మార్కును ఇప్పటికి వరకు అమెరికాలో 57 కంపెనీలు, బ్రిటన్‌లో 7 కంపెనీలు, చైనాలో 11 కంపెనీలు అందుకున్నాయి. రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ డాలర్‌ మారక విలువల్లో 138.2 డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో ప్రపంచంలో ఆరో అతిపెద్ద మార్కెట్‌ క్యాప్‌ కలిగిన ఆయిల్‌ కంపెనీగా అవరించింది. టెలికాం, రీటైల్‌ వ్యాపారాల్లో మెరుగైన ప్రదర్శన కారణంగా రిలయన్స్‌ షేరు ఈ ఏడాదిలో 31శాతం ర్యాలీ పెరిగింది. 



You may be interested

టాప్‌ 6 ఆయిల్‌ దిగ్గజాల్లో ఆర్‌ఐఎల్‌

Wednesday 20th November 2019

తాజా ర్యాలీతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ అంతర్జాతీయ ఆరు చమురు దిగ్గజాల్లో స్థానం దక్కించుకుంది. ఆర్‌ఐఎల్‌ షేరు కదం తొక్కుతుండడంతో బీపీ సంస్థను తోసిరాజని రిలయన్స్‌ ప్రపంచంలో ఆరో అతిపెద్ద చమురు కంపెనీగా అవతరించింది. బీపీ మార్కెట్‌ క్యాప్‌ 13200 కోట్ల డాలర్లుండగా, మంగళవారం ఆర్‌ఐఎల్‌ 13300 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించింది. మరోవైపు నష్టాల ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో బీపీ షేరు పడిపోవడం ఆ కంపెనీ వాల్యూను

ఆర్‌ఐఎల్‌లో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం!

Wednesday 20th November 2019

రిస్కు తీసుకునే ట్రేడర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరులో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. షేరులో కనిపిస్తున్న జోరు మరికొంత కాలం కొనసాగుతుందన్న అంచనాలతో ఈ వ్యూహం అవలంబిస్తారు. కంపెనీ పోటీదారులైన ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ బాటలో టారిఫ్‌లు పెంచాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేరు మరింత ముందుకే కొనసాగవచ్చని నిపుణుల అంచనా.  వ్యూహం: కాల్‌ రేషియో స్ప్రెడ్‌లో భాగంగా 1560 కాల్‌ కొనుగోలు చేసి 1620 కాల్స్‌ రెండిటిని

Most from this category