News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌క్యాప్‌ @ 9 లక్షల కోట్లు!

Friday 18th October 2019
Markets_main1571377628.png-28975

-ఆల్‌టైం గరిష్ఠానికి కంపెనీ షేరు
దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,  శుక్రవారం సెషన్‌లో రూ. 9 లక్షల కోట్లు మార్కెట్‌ క్యాప్‌ ఉన్న మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. కంపెనీ సెప్టెంబర్‌ ఫలితాలలో బలమైన ఫలితాలను ప్రకటిస్తుందనే అంచనాల నేపథ్యంలో రిలయన్స్‌ షేరు విలువ 2 శాతానికి పైగా ర్యాలీ చేసీ రూ. 1427.90 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ కంపెనీ షేరు విలువ 26 శాతం పెరగడం గమనార్హం.  దీంతో కంపెనీ మార్కెట​క్యాప్‌ రూ. 9 లక్షల కోట్లను తాకింది. కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, తన రిటైల్‌, టెలికాం, రిఫైనింగ్‌ విభాగాల పనితీరు బాగుండడంతో సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి బలమైన ఫలితాలను ప్రకటిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 14 మంది బ్లూమ్‌బర్గ్‌ విశ్లేషకులు కంపెనీ ఏకికృత నికర లాభం రూ. 11,256 కోట్లుగా ఉంటుందని, 9 మంది బ్లూమ్‌బర్గ్‌ విశ్లేషకులు కంపెనీ ఆదాయం రూ. 1.51 లక్షల కోట్లుగా ఉంటుందని  అంచనావేశారు. ఉదయం 11.10 సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు విలువ 1.71 శాతం లాభపడి రూ. 1,420.35 వద్ద ట్రేడవుతోంది.  ఇదే సమయానికి కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 8,85,040.00 కోట్లుగా ఉంది. 



You may be interested

1490 డాలర్లపైన పసిడి

Friday 18th October 2019

చైనా ఆర్థిక గణాంకాలు నిరాశపరడచంతో పాటు బ్రెగ్జిట్‌ అంశం నేపథ్యంలో పసిడి ధర శుక్రవారం 1490డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3 డాలర్ల స్వల్ప నష్టంతో 1,495 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈయూ నుంచి బ్రిటన్‌ విడిపోవడానికి బ్రెగ్జిట్‌ నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ గురువారం ప్రకటనతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.

భయపెడుతున్న చైనా వృద్ధి రేటు..నష్టాల్లో చమురు

Friday 18th October 2019

  చైనా మూడవ త్రైమాసికపు జీడీపీ వృద్ధిరేటు 3 దశాబ్దాల కనిష్ఠానికి పడిపోతుందని విశ్లేషకులు అంచనా వేయడంతో చమురు ధరలు శుక్రవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన, ప్రపంచంలోనే అత్యధిక చమురు వినియోగ దేశమైన చైనా ఆర్థిక వ్యవస్థ మందగించిన విషయం విదితమే. ఉదయం 10.17 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.55 శాతం నష్టపోయి బారెల్‌ 59.58 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.22

Most from this category