STOCKS

News


రికార్డుస్థాయిని అందుకున్న నిఫ్టీ షేర్లు రెండే..!

Tuesday 26th November 2019
news_main1574761540.png-29873

మార్కెట్‌ మంగళవారం ట్రేడింగ్‌లో ఆల్‌టైం హైని తాకింది. ప్రధాన సూచీలైన సెనెక్స్‌ 41,120 వద్ద, నిఫ్టీ 12,132.45 తమ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 31,813.70 వద్ద నూతన ఆల్‌టైంకి చేరుకుంది. ముఖ్యంగా సెన్సెక్స్‌ కొద్దిరోజుల క్రితం కొత్త రికార్డును నెలకొల్పినా, ఈ ఫీట్‌ సాధించడంలో వెనుకబడి వున్న నిఫ్టీ ఎట్టకేలకు మంగళవారం కొత్త రికార్డును సృష్టించింది. సాధారణంగా ఇండెక్స్‌లు జీవితకాల గరిష్టాన్ని అందుకున్న ప్రతిసారీ ఈ సూచీల్లో భాగమైన ఎక్కువ  షేర్లు  అదే ఫీట్‌ను సాధిస్తుంటాయి. తాజాగా ఇరుసూచీల్లో కేవలం రెండు షేర్లు మాత్రమే కొత్త ఆల్‌టైం హైని అందుకున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు వాటిలో ఉన్నాయి. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:-  నేడు బీఎస్‌ఈలో రూ.1569.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత రెండు రోజుల వరుస ర్యాలీని కొనసాగిస్తూ నేడు కూడా ఈ షేరు లాభాల బాట పట్టింది. ఒక దశలో 1శాతం వరకు పెరిగి రూ1576.00 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ఈ స్థాయి వద్ధ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.9.96లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్‌ ముగిసే సరికి క్రితం ఈ షేరు రికార్డుస్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. చివరకు గత ముగింపు(రూ.1560.70)తో పోలిస్తే 0.10శాతం నష్టంతో రూ.1558.85 వద్ద స్థిరపడింది. టెలికం, రిటైల్‌ వ్యాపారాలు రానున్న రోజుల్లో రాణిస్తాయనే అంచనాలో షేరు నెలరోజుల్లో 9శాతం ర్యాలీ చేయగా, ఏడాది కాలంలో 41 శాతం లాభపడింది. 

ఐసీఐసీఐ బ్యాంక్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.501.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. వరుసగా రెండో రోజూ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఇంట్రాడేలో 4శాతానికి పైగా పెరిగి రూ.517.50 వద్ద కొత్త ఆల్‌టైం హైని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి క్రితం ముగింపు(రూ.498.05)తో పోలిస్తే 2.62శాతం లాభంతో  2శాతం లాభంతో రూ.511.10 వద్ద స్థిరపడింది.  ఈ ముగింపు సైతం ఐసీఐసీఐ బ్యాంక్‌కు రికార్డే. నిఫ్టీ సూచీలో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానంలో ముగిసింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరసుగా రూ.310.30, రూ.517.50గా నమోదయ్యాయి. You may be interested

విదేశీ ఇన్వెస్టర్ల రాడార్‌లో మిడ్‌క్యాప్స్‌!

Tuesday 26th November 2019

-సునిల్‌ సుబ్రమణ్యం ‘పూర్తి లార్జ్‌క్యాప్‌లను మాత్రమే కాకుండా మిడ్‌క్యాప్‌ విభాగాన్ని కూడా ఎఫ్‌ఐఐ(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు)లు పరిశీలిస్తున్నారు’ అని ఎండీ, సీఈఓ, సుందరమ్‌ మ్యుచువల్‌ ఫండ్‌, సునిల్‌ సుబ్రమణ్యం ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... మార్కెట్ ర్యాలీ కొన్ని స్టాకుల వలనే.. మార్కెట్లో కొన్ని స్టాకుల మాత్రం ర్యాలీ చేస్తున్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు అధికంగా వీటిపై దృష్ఠి సారించలేరు.  మార్కెట్లు పడిపోతాయనే

సూచీలు పరుగులు తీసినా...అధికశాతం షేర్లు నష్టాల్లోనే!

Tuesday 26th November 2019

బెంచ్‌మార్క్‌ సూచీలు కొత్త రికార్డులను అందుకున్నప్పుడు విస్తృతంగా స్టాకులు పెరగాలి. కానీ ఇండియా ఈక్విటీ మార్కెట్లలో చాలా వరకు షేర్లు పడిపోగా, భారీగా పెరిగిన స్టాకులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ​కేవలం కొంత మంది ఇన్వెస్టర్లు మాత్రమే గత కొన్ని నెలలలో టాప్‌ 15-20 స్టాకులలో పెట్టుబడులు పెట్టారు. కాగా దీర్ఘకాలంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడంతో విస్తృత మార్కెట్‌లో అమ్మకాలు జరిగాయి. ఫలితంగా సూచీలు మంచి ప్రదర్శన చేసినప్పటికి,

Most from this category