News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6 శాతం పతనం

Thursday 4th October 2018
Markets_main1538634338.png-20850

మార్కెట్‌ పతనంలో భాగంగా రియలన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 6.50శాతం నష్టపోయింది. నేడు ఎఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో రూ.1,189.50 ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో మార్కెట్‌ పతనంలో భాగంగా ఇన్వెస్టర్లు రిలయన్స్‌ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ షేరు 5.38శాతం నష్టపోయి రూ.1128.00స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 98లక్షల వాల్యూమ్స్‌తో ట్రేడైంది. గత తొమ్మిది నెలల్లో ఒక్కరోజుల్లో ఇంతస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఉదయం గం.11:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ1,205.10)తో పోలిస్తే 5శాతం నష్టంతో 1,144.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ సూచి నేడు కోల్పోయి 200 పాయింట్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 45 పాయింట్లు కావడం విశేషం. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.785.35లు, రూ.1,329.00లుగా నమోదయ్యాయి.



You may be interested

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే శరణ్యమా?

Thursday 4th October 2018

ఎంఎఫ్‌ల నుంచి వైదొలగడం ఉత్తమమా? డైలమాలో ఇన్వెస్టర్లు ఈక్విటీల అధ్వాన్న ప్రదర్శన రిటైల్‌ ఇన్వెస్టర్లను చాలా భయపెడుతోంది. ఎకానమీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అంతర్జాతీయ పరిస్థితులు చూస్తే ఈక్విటీలంటే సగటు ఇన్వెస్టరు వణికిపోతున్నాడు. చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ఫండ్స్‌లో తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈక్విటీలను నమ్ముకోవడం కంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పొదుపు చేసుకోవడం మంచిదని చాలామంది భావిస్తున్నారు. నిజానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులను తీసుకువచ్చి భారీ రాబడుల కోసం

యస్‌ బ్యాంక్‌కు ‘బై’ రేటింగ్‌..

Thursday 4th October 2018

బ్రోకరేజ్‌ సంస్థలు యస్‌ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉన్నాయి. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాయి. కొత్త బాస్‌ ఎంపికపైనే ప్రధానంగా దృష్టి కేంద్రకరించినట్లు యస్‌ బ్యాంక్‌ పేర్కొనిందని, అలాగే రుణ నాణ్యత స్థిరంగా ఉందని పునరుద్ఘాటించిందని బ్రోకరేజ్‌ సంస్థలు పేర్కొన్నాయి.  డాయిష్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఇన్వెస్టెక్‌, మెక్వైరీ, మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థలన్నీ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నాయి. రూ.310-రూ.430 శ్రేణిలో టార్గెట్‌ ధరలను నిర్ణయించాయి.  బ్యాంక్‌ వెల్లడించిన చర్యల వల్ల

Most from this category