News


రూ. 10 లక్షల కోట్ల కంపెనీగా రిలయన్స్‌!

Thursday 28th November 2019
Markets_main1574916829.png-29920

దేశంలో రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌ కలిగివున్న కంపెనీగా, ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం సెషన్‌లో అవతరించింది. గత కొన్ని సెషన్‌లలో రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ మార్కుకు దగ్గరగా వచ్చి వెనుతిరిగిన ఈ కంపెనీ, తన టెలికాం విభాగం రిలయన్స్‌ జియోపై ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉండడంతో గురువారం ఈ మైలు రాయిని అందుకుంది. టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపుపై ప్రభుత్వం జోక్యం చేసుకోదని, ఈ కంపెనీలు టారిఫ్‌లను పెంచాలని నిర్ణయించుకున్నాయని, ఈ టారిఫ్‌లు మరింత పెరగొచ్చని టెలికాం డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారి ఒకరు గురువారం మీడియాతో అన్నారు. దీంతో రిలయన్స్‌ జియోపై పాజిటివ్‌ సెంటిమెంట్‌ మరింత బలపడింది. ఫలితంగా గురువారం సెషన్‌లో ఉదయం 10.16 సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 0.58 శాతం లాభపడి రూ. 1578.80  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 1569.75 వద్ద ముగిసిన ఈ షేరు, గురువారం సెషన్‌లో రూ. 1572.50 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. కాగా సెషన్‌ ప్రారంభమైన కొద్ది సమయంలోనే రూ. 1579 వద్ద రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీగా రిలయన్స్‌ అవతరించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 18 న రూ. 9 లక్షల కోట్లకు చేరుకుంది. కాగా రూ. లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కంపెనీ, దాదాపు నెలరోజుల్లోనే జోడించడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గల కాల వ్యవధిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 41 శాతం వృద్ధి చెందింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 13 శాతం మాత్రమే పెరగడం గమనార్హం.



You may be interested

మీ మొబైల్‌ బిల్లు మోత ఖాయం

Thursday 28th November 2019

టెలికాం కంపెనీలు ఫ్లోర్‌ ప్రైస్‌(కంపెనీలన్ని కలిసి నిర్ణయించిన ధర)ను ఏర్పరిచేందుకు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌), టెలికాం డిపార్ట్‌మెంట్‌ అంగీకరించలేదు. అయినప్పటికి టెలికాం కంపెనీలయిన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా, రిలయన్స్‌ జియో, భారత్‌ సంచార్‌ నిగమ్‌ వచ్చే నెల నుంచి టారిఫ్‌లను పెంచేందుకు సిద్ధపడుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదలుచుకోలేదని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ‘ఫ్లోర్‌ ప్రైస్‌ను ఏర్పరచడంపై ఇంకా ఎటువంటి చర్చ అవసరం లేదు’ అని టెలికాం

32,000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 28th November 2019

సూచీల రికార్డు ర్యాలీలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ సైతం కొత్త రికార్డు అందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు తొలిసారి 32000 స్థాయిని అధిగమించింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,981.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో పాటు, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లో యస్‌బ్యాంక్‌(3.50శాతం), ఆర్‌బీఎల్‌(3శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(ఆల్‌టైం) ర్యాలీతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 150

Most from this category