News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4శాతం అప్‌

Tuesday 24th September 2019
Markets_main1569302908.png-28514

రెండురోజుల భారీ ర్యాలీ తర్వాత మంగళవారం మార్కెట్‌లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటుంది. ఫలితంగా ఉదయం 10.50 సమయానికి నిఫ్టీ 22.20 పాయింట్లు నష్టపోయి 11,578.00 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 43.15 పాయింట్లు కోల్పోయి 39,046.88 పాయిం‍ట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు పాజిటివ్‌గా ట్రేడయ్యి మార్కెట్‌ నష్టాలను తగ్గింస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఉదయం 10.50 సమయానికి 4.59 శాతం లాభపడి రూ. 1,296.15 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై ట్యాక్స్‌ కట్‌ ప్రయోజనాలు పరిమితంగా ఉండడంతో గత సెషన్‌లో మార్కెట్‌లు భారీ ర్యాలీ చేసినప్పటికి ఈ కంపెనీ షేరు 1.5 శాతం నష్టపోయి రూ.1,239.20 వద్ద ముగిసింది. మంగళవారం ట్రేడింగ్‌లో రూ. 1,243.60 వద్ద ప్రారంభమైన ఈ షేరు, రూ. 1,298.80 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.    



You may be interested

2వారాల గరిష్టానికి పసిడి

Tuesday 24th September 2019

ఆర్థిక మందగమన భయాలు, మధ్య పశ్చిమాసియా ఉద్రికత్తలతో క్రితం సెషన్‌లో 2వారాల గరిష్టాన్ని అందుకున్న పసిడి ధర మంగళవారం ట్రేడింగ్‌లో స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,530 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే అమెరికా చైనాల మధ్య సానుకూల చర్చలు పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతున్నాయి.‘‘ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చని ఇరు దేశాలు (చైనా, యునైటెడ్ స్టేట్స్)

డిమాండ్‌ ఆందోళనలు..తగ్గిన చమురు

Tuesday 24th September 2019

  సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరగడంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో చమురు ధరలు గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. అయినప్పటికి యూరోప్‌ దేశాలు, జపాన్‌ విడుదల చేసిన తయారిరంగం డేటా బలహీనంగా ఉండడంతో చమురు మార్కెట్‌లో డిమాండ్‌ భయాలు తిరిగి పుంజుకున్నాయి. ఫలితంగా మంగళవారం చమురు నష్టపోయి ట్రేడవుతోంది. ఉదయం 9.57 సమయానికి  బ్రెంట్‌ క్రూడ్‌ 0.66 శాతం నష్టపోయి బారెల్‌ 63.31 డాలర్ల వద్ద,

Most from this category