News


ఫలితాల ఎఫెక్ట్‌...ఆర్‌ఐఎల్‌ 1.5 శాతం అప్‌

Tuesday 22nd October 2019
Markets_main1571717490.png-29042

రిలయన్స్‌ ఫలితాలు బాగుండడంతో మంగళవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు 1.5 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 1,436 వద్ద ప్రారంభమయ్యింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి రికార్డ్‌ స్థాయిలో లాభాన్ని శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో రూ.9,516 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ క్యూ2లో రూ.11,262 కోట్లకు ఎగిసింది. ఉదయం 9.45 సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 0.96శాతం లాభపడి రూ. 1,430 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో ఈ కంపెనీ షేరు రూ. 1,416.35 వద్ద ముగిసింది.



You may be interested

ప్రారంభంలో సూచీల హెచ్చుతగ్గులు

Tuesday 22nd October 2019

మార్కెట్‌ ఆరురోజుల వరుస లాభాల ముగింపు పలుకుతూ మంగళవారం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 65 పాయింట్ల నష్టంతో 39,233.40 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 11,652.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 10శాతం నష్టపోయి రూ.691.10 వద్ద లోయర్‌ సర్కూ‍్యట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యాయి. అనంతరం రిలీవ్‌ అయ్యి భారీ పతనం దిశగా కదులుతున్నాయి. భారత

ఇన్ఫోసిస్‌ 15% క్రాష్‌!

Tuesday 22nd October 2019

 స్వల్ప కాలంలో మార్జిన్‌లు, లాభాలను పెంచుకోడానికి అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా, కొంత మంది ఉద్యోగులు యుఎస్‌ సెక్యురిటీ ఎక్సెంజ్‌కి, ఇన్ఫోసిస్‌ బోర్డుకు లేఖలు రాయడంతో సోమవారం సెషన్‌లో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు(యుఎస్‌ మార్కెట్లో) 16 శాతం మేర పడిపోయాయి. అదే విధంగా దేశీయ మార్కెట్‌లో కూడా ఇన్ఫోసిస్‌ షేరు మంగళవారం సెషన్‌లో 10 శాతం లేదా రూ. 76.75 నష్టపోయి రూ. 691.10 వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో షేరు

Most from this category