News


రిలయన్స్‌ బీమా ఐపీఓ వెనక్కి

Thursday 31st October 2019
Markets_main1572492406.png-29246

  • రెండోసారి ఉపసంహరించుకున్న కంపెనీ 

న్యూఢిల్లీ: అనిల్‌ ధీరుబాయ్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ప్రణాళికను అటకెక్కించింది. సెబీకి సమర్పించిన ఐపీఓ ముసాయిదా పత్రాలను వెనక్కి తీసుకుంది. ఐపీఓను ఎందుకు  ఉపసంహరించుకుందో వివరాలను కంపెనీ గానీ, ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న మోతిలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ గానీ వెల్లడించలేదు. షెడ్యూల్‌ ప్రకారమైతే, ఈ ఐపీఓలో భాగంగా రూ.200 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ జారీ చేయనున్నది. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద రిలయన్స్‌ క్యాపిటల్‌ 7.9 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది. 
2017లో కూడా అంతే ! 
రిలయన్స్‌ బీమా ఐపీఓ డాక్యుమెంట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 8నే మోతిలాల్‌ ఓస్వాల్‌ సంస్థ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ డాక్యుమెంట్లను ఉపసంహరించుకుంటున్నామని ఈ నెల 24న సెబీకి ఒ‍క మెయిల్‌ పంపించింది. రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐపీఓ ప్లాన్‌ను ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. 2017, అక్టోబర్‌లో ఐపీఓ పత్రాలను సమర్పించి ఆ మరుసటి నెలలో సెబీ నుంచి ఆమోదం పొందింది. అయితే అప్పుడు స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులమయంగా సాగడం, ఐపీఓల పట్ల ఇన్వెస్టర్లకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఐపీఓ ప్లాన్‌ను అటకెక్కించింది. 



You may be interested

వచ్చే ఏడాది పాలసీల వెల్లువ

Thursday 31st October 2019

ఇండియాఫస్ట్‌ డిప్యూటీ సీఈవో రుషభ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- బీమా కంపెనీల నుంచి వచ్చే ఏడాది పాలసీలు వెల్లువలా వచ్చిపడతాయని ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏ) చొరవతో వినూత్న పాలసీలు రానున్నాయని ఇండియాఫస్ట్‌ డిప్యూటీ సీఈవో రుషభ్‌ గాంధీ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పాలసీదారులకు అనుకూలంగా ఉండేలా కంపెనీలు వీటిని రూపొందిస్తున్నాయని చెప్పారు. మూడు పాలసీలకు తాము దరఖాస్తు

పొదుపు పట్ల మహిళల్లో అప్రమత్తత

Thursday 31st October 2019

ఎఫ్‌డీలు, పీపీఎఫ్‌లకే మెజారిటీ ప్రాధాన్యం లేదంటే బ్యాంకు ఖాతాల్లోనే.. న్యూఢిల్లీ: పొదుపు విషయమై మహిళల్లో అధిక అప్రమత్తత ఉంటున్నట్టు ఓ సర్వే ఫలితాల ఆధారంగా తెలుస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) లేదా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికే 58 శాతం మంది మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నారు. లేదంటే బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల్లో ఉంచేస్తున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా ఆర్థిక సేవలు అందించే స్క్రిప్‌బాక్స్‌ అక్టోబర్‌ నెల మొదటి రెండు వారాల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ

Most from this category