News


రివకరి బాటలో అడాగ్‌ గ్రూప్‌ షేర్లు

Wednesday 26th June 2019
Markets_main1561542155.png-26592

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా నష్టపోయిన అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో రికవరి బాట పట్టాయి. ఈ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ ఇన్ఫ్రా, రిలయన్స్‌ పవర్‌,  రిలయన్స్‌  క్యాపిటల్‌ షేర్లు 20శాతం నుంచి 13శాతం ర్యాలీ చేశాయి. ఎన్‌ఎస్‌ఈలోని ఎఫ్‌అండ్‌ఓ సెక్యూరిటీస్‌ విభాగంలో టాప్‌-10 గెయినర్లలో మూడు షేర్లు మొదటి మూడు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 
రిలయన్స్‌ ఇన్ఫ్రాటెల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.50.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్ల మద్ధతు లభించడంతో షేరు ఇంట్రాడేలో 25శాతం పెరిగింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు(రూ.51.95)తో పోలిస్తే 18శాతం లాభంతో రూ.51.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
రిలయన్స్‌ పవర్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.3.95 ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్ల మద్ధతు లభించడంతో షేరు ఇంట్రాడేలో 17 శాతం పెరిగి రూ.4.65శాతం వద్ద ఇంట్రాడే హైని తాకింది.  మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు(రూ.4.00)తో పోలిస్తే 11శాతం లాభంతో రూ.4.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
రిలయన్స్‌ క్యాపిటల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.61.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్ల మద్ధతు లభించడంతో షేరు ఇంట్రాడేలో 25శాతం పెరిగింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గత ముగింపు(రూ.51.95)తో పోలిస్తే 11శాతం లాభంతో రూ.51.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

పేలవ స్టాకుల్లో పెరిగిన రిటైలర్ల పెట్టుబడులు

Wednesday 26th June 2019

ఈ ఏడాది అత్యంత అధ్వాన్న ప్రదర్శన జరిపిన స్టాకుల్లో అనూహ్యంగా రిటైలర్ల హోల్డింగ్స్‌ పెరిగిపోతున్నాయి. కొందరు అనలిస్టులు సైతం వీటి విషయంలో తప్పుగా ఊహించారు. ఇలాంటి పతనమైతున్న స్టాకుల ధరలను వాల్యూషన్లతో పోల్చి తప్పులో కాలేశారు. వీరిని చూసి గుడ్డిగా పలువురు రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం ఇలాంటి స్టాకుల్లో చేతులు కాల్చుకున్నారు. రిటైలర్లకు ఇలాంటి కంపెనీల్లో నెలకొన్న నిజ సమస్యల స్వరూపం తెలియదని, కేవలం స్టాక్‌ ధరను చూసి గుడ్డిగా

ఇన్సూరెన్స్‌ భవిష్యత్‌ బాగుంది: సెంట్రమ్‌ బ్రోకింగ్‌

Wednesday 26th June 2019

పార్మా రంగానికన్నా ఐటీ రంగమే మంచిది వచ్చే  3-4 నెలలో ఆటో రంగం ​ఒత్తిడికి లోనయ్యే అవకాశం కానీ లాంగ్‌ టెర్మ్‌ పెట్టుబడులతో మంచి లాభాలు పొందవచ్చు ఇన్సూరెన్స్‌ రంగంలో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ: జగన్నాథం తునుగుంట్ల పార్మారంగంలో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా అధిక మూలధనమున్న ఐటీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమని, ఆర్బీఐ ప్రభుత్వానికి నగదు ఇస్తే రూపీ బలహీనత పెరుగుతుందని అది ఐటీ రంగానికి మంచిదేనని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీనియర​ వైస్‌ప్రెసిడెంట్‌,

Most from this category