News


ఆటో సూచీలో గోల్డెన్‌ క్రాస్‌!

Monday 30th December 2019
Markets_main1577697588.png-30532

బుల్లిష్‌ అంటున్న నిపుణులు 
రెండేళ్ల తర్వాత ఆటో సూచీలో బుల్లిష్‌ సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమ్మకాల్లో రికవరీ ఉంటుందన్న ఆశల నడుమ ఆటో స్టాకులు క్రమంగా పాజిటివ్‌ ధృక్పథంలోకి మారుతున్నాయంటున్నారు. తాజాగా నిఫ్టీ ఆటో సూచీలో గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. 2016 మే తర్వాత నిఫ్టీ ఆటో సూచీలో గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడడం ఇదే తొలిసారి. స్వల్పకాలిక మూవింగ్‌ యావరేజ్‌ రేఖ దిగువ నుంచి పైకి దీర్ఘకాలిక మూవింగ్‌యావరేజ్‌ రేఖను ఖండిస్తే దాన్ని గోల్డెన్‌ క్రాస్‌గా చెబుతారు. తాజాగా నిఫ్టీ ఆటో సూచీలో 50 డీఎంఏ రేఖ కింద నించి పైకి 200 డీఎంఏ రేఖను ఛేదించింది. ఇది ఆటో రంగ స్టాకులపై ఇన్వెస్టర్లకు ఏర్పడుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ ఆటో సూచీలో 15 షేర్లున్నాయి. ప్రస్తుతం వీటిలో 10 షేర్లు వాటి వాటి 200 రోజుల డీఎంఏ కన్నా పైన కదలాడుతున్నాయి. అక్టోబర్‌లో కేవలం 5 స్టాకులే వాటి 200 డీఎంఏకు పైన ఉండగా, తాజాగా వీటి సంఖ్య పెరగడం పాజిటివ్‌ సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆటో కంపెనీల్లో నెగిటివ్‌ ధోరణి బాటమ్‌అవుట్‌ అయిందని మోతీలాల్‌ఓస్వాల్‌ ప్రతినిధి చందన్‌ తపారియా చెప్పారు. 


అయినా కానీ..
కొందరు నిపుణులు మాత్రం ఆటో రంగంలో ఇంకా అప్రమత్తతే అవసరమని సూచిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న బుల్లిష్‌ ధోరణి కృత్తిమంగా కనిపిస్తోందని, బలమైన మూలాల కారణంగా వచ్చింది కాదని ఎక్సెపెరెల్‌ ప్రతినిధి అవిక్‌ ఛటోపాధ్యాయ చెప్పారు. ఆటో కంపెనీల టాప్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యలతో ఈ కృత్తిమ బుల్లిష్‌నెస్‌ వచ్చిందన్నారు. కానీ ఎక్కువమంది అనలిస్టులు మాత్రం ఆటో రంగంలో టర్నెరౌండ్‌ ఆరంభమైందనే నమ్ముతున్నారు. ఇక్రా సైతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిమాండ్‌ ఊపందుకొని ఆటో, ఆటో అనుబంధ రంగాలు మంచి పనితీరు కనబరుస్తాయని అంచనా వేసింది. 2019లో ఆటో రంగం బేరిష్‌గా కొనసాగింది. మార్కెట్‌ లీడర్‌ మారుతీ సుజుకీ వరుసగా 9నెలల పాటు తన ఉత్పత్తిలో కోతలు విధించుకుంది. ఇతర కంపెనీలు సైతం ఇదే బాట పట్టాయి. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభంతో వచ్చిన లిక్విడిటీ కొరత ఆటో రంగంపై పెను ప్రభావం చూపింది. 



You may be interested

నెల్కో- ఎన్‌సీసీ హైజంప్‌

Monday 30th December 2019

వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ఒక దశలో లాభాలు పోగొట్టుకోవడంతోపాటు నష్టాలలోకి సైతం ప్రవేశించాయి. తదుపరి మిడ్‌సెషన్‌లో తిరిగి కొనుగోళ్లు కనిపించడంతో మిశ్రమంగా కదులతున్నాయి. మధ్యాహ్నం 3 ప్రాంతంలో సెన్సెక్స్‌ 3 పాయింట్ల నామమాత్ర నష్టంతో 41,572కు చేరగా.. నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని 12,258 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ రెండు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్ల

గృహ రుణాలపై ఎస్‌బీఐ న్యూఇయర్‌ గిఫ్ట్‌

Monday 30th December 2019

వడ్డీ రేటులో 25 బేసిస్‌ పాయింట్ల కోత తగ్గనున్న నెలసరి వాయిదా మొత్తాలు పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) గృహ రుణ వినియోగదారులకు కొత్త ఏడాది శుభవార్తను మోసుకొచ్చింది. ఎస్‌బీఐ.. తాజాగా హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లలో 25 బేసిస్‌ పాయింట్లు(పావు శాతం) కోత పెట్టింది. దీంతో వార్షిక ప్రామాణిక వడ్డీ రేటు(ఈబీఆర్‌) ప్రస్తుత 8.05 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గనుంది. రేట్ల తగ్గింపును 2020 జనవరి 1 నుంచీ అమలు చేయనున్నట్లు

Most from this category