News


లోకల్‌ ఓకే.. కరోనానే రిస్క్‌..!

Monday 10th February 2020
Markets_main1581274191.png-31631

బడ్జెట్‌ ముగిసింది. డిసెంబర్‌ క్వార్టర్‌ కంపెనీల ఫలితాల విడుదల సీజన్‌ కూడా చివరి దశకు చేరింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్యం విషయంలో డీల్‌ కుదరగా, అమెరికా ఉత్పత్తులపై పెంచిన టారిఫ్‌లను చైనా కొంత మేర తగ్గించడం కూడా జరిగిపోయింది. దేశీయంగా ప్రతికూల వార్తలేవీ ఇప్పటికైతే లేవు. అంతర్జాతీయంగానూ పరిస్థితులు ఆశావహంగా మారుతున్న రుణంలో కరోనా వైరస్‌ వెలుగు చూసింది. ఇప్పుడు ఈ వైరస్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాను వణికిస్తోంది. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లను అస్థిరతలకు గురి చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా నిపుణుల అభిప్రాయాలు చూద్దాం..

 

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను భారత స్టార్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని బ్యాటింగ్‌ స్టయిల్‌తో పీఎంఎస్‌ ఫండ్‌ మేనేజర్‌ బసంత్‌ మహేశ్వరి పోల్చారు. ఇక ఐథాట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు శ్యామ్‌శేఖర్‌.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు గత వారం ఆర్‌బీఐ ప్రకటించిన విధానం మరో సానుకూల బూస్టర్‌ షాట్‌గా అభివర్ణించారు. ‘‘జీఎస్‌టీ వసూళ్లు అధికంగా ఉన్నాయని చాలా మంది ఉత్సాహానికి గురై ఉంటారు. కౌంటర్‌ పార్టీ రిటర్నులు ఫైల్‌ చేయకపోవడంతో చాలా మంది ఇన్‌పుట్‌ క్రెడిట్‌ను పొందలేకపోయారు. ఈ నెల ఆ ఇన్‌పుట్‌ క్రెడిట్‌ అంతా తీసేసుకోవడం జరుగుతుంది. వసూళ్లను 10-20,000 కోట్లను అధికంగా చూపించారు’’ అని ప్రముఖ మార్కెట్‌ నిపుణులు సందీప్‌సభర్వాల్‌ పేర్కొన్నారు.

 

మరింత సౌలభ్యం కోసం మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను పునర్‌వర్గీకరిస్తామని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి ఇటీవలే ప్రకటించారు. దీనిపై స్పందనలు చూస్తే.. ‘‘మిడ్‌క్యాప్‌ పునర్‌వర్గీకరణ చేపడితే అన్ని రంగాల్లోనూ మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ 15-20 శాతం పెరిగేందుకు అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల పరంగా ఎక్కువగా వ్యాఖ్యానించలేము. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉంటే, ఫిబ్రవరి నెల మంచిదే అవుతుంది’’ అని వ్యాల్యూ ఇన్వెస్టర్‌ సఫిర్‌ ఆనంద్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. పునర్వ్యవస్థీకరణ అనేది లిక్విడిటీ కోణం మినహా ఇతరత్రా చేపట్టడం మంచిది కాదన్నారు అవెక్సాట్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజరీ సీఈవో అవీక్‌మిత్రా. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసిన వారు త్రైమాసిక ఫలితాలను చూసి అతిగా స్పందించనవసరం లేదన్నారు ఐథాట్‌ సహ వ్యవస్థాపకుడు శ్యామ్‌ శేఖర్‌. ఈ విధానం మంచి ఫలితాలను ఇవ్వడం తాను చూశానని, దీర్ఘకాలం కోసం అయితే త్రైమాసిక ఫలితాలు పెద్ద అంశం కాదని తెలియజేశారు. You may be interested

మార్కెట్లు అలసిపోయాయా..?

Monday 10th February 2020

నిఫ్టీలో గత శుక్రవారం కనిపించిన స్థిరీకరణ సోమవారం నాటి సెషన్‌లో ముగియవచ్చని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. నిఫ్టీ శుక్రవారం వెనుదిరిగే ప్రయత్నం చేసినప్పటికీ 50 డీఎంఏ అయిన 12,118 వద్ద నిరోధం ఎదుర్కొన్నట్టు చెప్పారు. సూచీలకు 12,050-12,120 కీలక నిరోధ స్థాయిలుగా తెలిపారు. నిఫ్టీకి సోమవారం 12,120-12,615 నిరోధాలుగా పనిచేస్తాయని తెలిపారు. అదే విధంగా 12,035-11,980 వద్ద మద్దతు స్థాయిలు

మరో 4 నాలుగు నెలల్లో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

Saturday 8th February 2020

కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి పూర్తి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై రాబోయే రెండు, మూడు, నాలుగు నెలల్లో స్పష్టంగా కనిపిస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వెజర్‌ సందీప్‌ సబర్వాల్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ ప్రస్తుతం ఆర్‌బీఐ పాలసీ విధానానికి అనుగుణంగా స్పందిస్తుందని ఆయన అన్నారు. అలాగే సందీప్‌ ​ ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు., ఆర్థిక వ్యవస్థ, రియల్టీ, షుగర్‌ షేర్లపై తన అభిప్రాయాలను ఒక ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Most from this category