News


పెరుగుతున్న మాంద్యం భయాలు.. మన పరిస్థితేంటి..?

Thursday 19th September 2019
Markets_main1568833778.png-28411

అంతర్జాతీయంగా మాంద్యం పట్ల భయాలు పెరుగుతున్నాయి. వర్ధమాన దేశాలతోపాటు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య తీవ్ర స్థాయిలో వాణిజ్య యుద్ధం నడుస్తుండడం, చమురు ధరల్లో అస్థిరతలు, మన దేశంపై ప్రభావం చూపించేవే. ఇప్పటికే మన దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. జూన్‌ క్వార్టర్‌లో 5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. దీంతో మన ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రోత్సాహక చర్యలను ప్రకటించింది. అంతర్జాతీయంగానూ మందగమనం తాకిడితో సెంట్రల్‌ బ్యాంకులు రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకు ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ నిర్వహించిన సర్వేలో... రానున్న 12 నెలల్లో మాంద్యం వస్తుందని 38 శాతం మంది చెప్పగా, సర్వేలో పాల్గొన్న 59 శాతం మంది రాకపోవచ్చని చెప్పడం గమనార్హం. ఆగస్ట్‌ 2009 తర్వాత మాంద్యానికి అనుకూలంగా అత్యధిక అంచనాలు వినిపించడం ఇప్పుడేనని ఈ నివేదిక పేర్కొంది. 

 

సెప్టెంబర్‌లో ఇన్వెస్టర్ల నగదు నిల్వలు 4.7 శాతానికి పడిపోయాయని, ఇటీవల జూన్‌ నెలలో గరిష్ట స్థాయి 5.7 శాతం నుంచి గణనీయంగా తగ్గాయని, పదేళ్ల సగటు 4.6 శాతానికి పైనే ఉన్నట్టు బ్యాంకాఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ నివేదిక పేర్కొంది. ఐదేళ్లలో దేశ జీడీపీని 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకోవడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో పడిపోతున్న ఆర్థిక వృద్ధికి అడ్డుకట్ట వేసేందుకు, వృద్ధికి పునరుత్తేజాన్ని తీసుకొచ్చేందుకు మరో విడత కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలను ప్రకటించనుందని సమాచాం. దేశంలో మందగమనం అన్నది సైక్లికల్‌గా వచ్చినదేనని, దీర్ఘకాలానికి మంచి వృద్ధి గమనం కొనసాగుతుందని నిపుణులు ఇప్పటికీ భావిస్తున్నారు. ‘‘ఇది భారత స్టోరీయే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉత్సాదకత నిర్మాణాత్మకంగా తగ్గిపోవడం కనిపిస్తోంది. మనం తక్కువ సామర్థ్యంతో కూడిన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తున్నాం. అంతర్జాతీయ వాణిజ్య సరఫరాను తగ్గించేస్తున్నాం. ఇది అతర్జాతీయ వృద్ధిని మళ్లీ తగ్గిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థకు ఇదొక ముఖ్యమైన ప్రతికూలత’’ అని జేపీ మోర్గాన్‌కు చెందిన ఏపీఏసీ టెలికం రీసెర్చ్‌ హెడ్‌ జేమ్స్‌ సల్లివన్‌ వివరించారు. భారత్‌ వచ్చే 10-30 ఏళ్లకు సానుకూలంగా వృద్ధి ప్రయాణం చేస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సప్లయ్‌ చైన్‌ పునర్నిర్మాణంతో లాభపడే దేశాల్లో భారత్‌ కూడా ఒకటని పేర్కొన్నారు. 

 

మనమేం చేయాలి..?
ఆర్థిక వ్యవస్థను వేగంగా పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం తను నిధనులను ఖర్చు చేయడంతోపాటు ప్రైవేటు రంగ వ్యయాలను కూడా పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ‘‘5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం కనీసం రూ.లక్ష కోట్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, డీఐఐలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం సౌర్వభౌమ బాండ్లు వంటి మరింత మెరుగైన పెట్టుబడులను గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాదు వాటిని ఎఫ్‌ఐఐలు, డీఐఐలకు మరింత ఆకర్షణీయంగా మార్చాలి’’ అని బొనాంజా పోర్ట్‌ఫోలియో ఫండ్‌ మేనేజర్‌ ప్రీతమ్‌ డ్యూస్కర్‌ పేర్కొన్నారు. You may be interested

నిఫ్టీ పుల్‌బ్యాక్‌ ర్యాలీ.. అయినా పరిమితమే..

Thursday 19th September 2019

నిఫ్టీ గురువారం పెరిగినా కానీ, పుల్‌బ్యాక్‌ పరిమితమేనంటున్నారు ప్రముఖ నిపుణులు, జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్ మిలాన్‌ వైష్ణవ్‌. మార్కెట్లపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది..   ‘‘బుధవారం సెషన్‌ స్తబ్దుగా ఉంది. నిఫ్టీ రెండు రోజుల నష్టం తర్వాత 23.05 పాయింట్ల లాభంతో, కీలకమైన మద్దతు స్థాయి పైన నిలిచింది. గురువారం వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ ఉంది. కనుక నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయి 10,780-10,800ని

రెండురోజుల పతనానికి బ్రేక్‌

Wednesday 18th September 2019

ముడిచమురు ధరల పెరుగుదలతో రెండు రోజుల పాటు భారీ పతనాన్ని చవిచూసిన సూచీలు బుధవారం స్వల్పలాభంతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ 83 పాయింట్లు పెరిగి 36,564 వద్ద, నిఫ్టీ 23.05 పాయింట్ల పెరుగుదలతో 10,840.65 వద్ద స్థిరపడింది. తిరుగుబాటుదారుల డ్రోన్‌ దాడి నేపథ్యంలో తగ్గిన చమురు ఉత్పత్తిని నెలాఖరులో పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటనతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల

Most from this category