News


రాణిస్తున్న రియల్టీ షేర్లు

Thursday 14th March 2019
Markets_main1552551012.png-24605

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్‌లో రియల్టీ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో 2.50శాతం ర్యాలీ చేసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండియాబుల్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ షేర్లు అత్యధికంగా 7.50శాతం లాభపడింది. అలాగే డీఎల్‌ఎఫ్‌ షేరు 5శాతం, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 3శాతం, ప్రెస్టేజ్‌ ఎస్టేజ్‌ షేరు 2శాతం లాభపడ్డాయి. సన్‌ టెక్‌, ఓబెరాయ్‌ లిమిటెడ్‌ షేర్లు 1శాతం వరకు పెరగ్గా, గోద్రేజ్‌ ప్రాపర్టీ షేరు అరశాతం ర్యాలీ చేసింది. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో మహీంద్రా లైఫ్‌ స్పేస్‌ డెవెలపర్స్‌ లిమిటెడ్‌ షేరు 3శాతం నష్టపోయింది. శోభ, బ్రిగేడ్‌షేర్లు అరశాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గతముగింపు(246.35 )తో పోలిస్తే 2శాతం లాభంతో 252.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌ గెయినర్లలో ఇండియాబుల్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ రెండో స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

అడాగ్‌ షేర్ల పతనం

Thursday 14th March 2019

అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన అడాగ్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి. ఎరిక్సన్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో నిధుల సమీకరణకు నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) తన అభిప్రాయాన్ని రిజర్వ్‌లో పెట్టడటం ఇందుకు కారణమైంది. ఎరిక్సన్‌కు రూ. 550 కోట్ల బకాయిలను నాలుగు వారాల్లో చెల్లించాలని గత నెల సుప్రీం కోర్టు ఆర్‌కామ్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణాల చెల్లింపునకు తమ

షేర్‌ఖాన్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Thursday 14th March 2019

ఎన్నికల ముందు వచ్చే ర్యాలీలో మంచి సత్తా చూపే నాలుగు మిడ్‌క్యాప్స్‌ను షేర్‌ఖాన్‌ సిఫార్సు చేస్తోంది. అందరూ ఊహించినట్లు ఎఫ్‌ఎంసీజీ స్టాకులో లేదా బాటా, టైటాన్‌ లాంటి కన్జూమర్‌ స్టాకులో కాకుండా ప్రీఎలక‌్షన్‌ ర్యాలీలో కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించింది.  1. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌: షేరులో కొంత బలహీనత కనిపిస్తున్నా, త్వరలో కోలుకొని దూసుకుపోగలదు.  2. అతుల్‌: మిడ్‌క్యాప్‌ నుంచి లార్జ్‌క్యాప్‌గా మారనుంది. రెండేళ్ల తర్వాత షేరులో మంచి కదలికలు కనిపిస్తున్నాయి.  3, 4:

Most from this category