News


నష్టాల్లో రియల్టీ రంగ షేర్లు

Tuesday 1st October 2019
news_main1569917822.png-28656

మార్కెట్‌ పతనంలో భాగంగా రియల్టీ ఇండెక్స్‌ మంగళవారం 4శాతానికి పైగా నష్టపోయింది. మార్కెట్‌ సెంటిమెంట్, ఆర్ధిక మందగమనం, సబ్‌ వెన్షన్‌ స్కీమ్‌ రద్దుతో పాటు ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆల్టికో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్‌ కుంభకోణాలతో రియల్టీ రంగ తీవ్ర ఒడిదుడులను ఎదుర్కోంటుంది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా గృహాల అమ్మకాలు 18శాతం క్షీణించడం సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఈ నేపథ్యంలో నేడు రియల్టీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ రియల్టీ షేర్లు అమ్మకాలు కొనసాగడంతో ఇండెక్స్‌ ఒకదశలో 4.12 శాతం క్షీణించి 248.05 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.1:40లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(258.75)తో పోలిస్తే 4శాతం నష్టంతో నష్టపోయి 249 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా డీఎల్‌ఎఫ్‌ షేర్లు 7.70శాతం, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ 5శాతం నష్టపోయింది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, బిగ్రేడ్‌ లిమిటెడ్‌ షేర్లు 4.50శాతం క్షీణించాయి. అలాగే ఒబేరాయ్‌ రియల్టీ షేర్లు 4శాతం, శోభ 2.50శాతం, ఫోనెక్స్‌ లిమిటెడ్‌, సన్‌టెక్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ షేర్లు 2 శాతం నష్టపోయాయి. మరోవైపు మహీం‍ద్రా లైఫ్‌ షేర్లు మాత్రం​ అరశాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

నిఫ్టీ 220, సెన్సెక్స్‌ 630 పాయింట్ల పతనం

Tuesday 1st October 2019

స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతో పాటు, సెప్టెంబర్‌ నెలకు సంబంధించి దిగ్గజ ఆటో కంపెనీల వాహన అమ్మకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోకపోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం 2శాతానికి పైగా నష్టపోయి ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. మధ్యాహ్నం 2.19 సమయానికి నిఫ్టీ 220.80 పాయిట్లు నష్టపోయి 11,253.65 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 639.1 పాయింట్లు నష్టపోయి 38,021.66

ఓఎంసీలను జీఆర్‌ఎం కాపాడుతుంది!

Tuesday 1st October 2019

క్యు2లో మంచి లాభాల నమోదుకు అవకాశాలు నిపుణుల అంచనా అంతర్జాతీయ మందగమన సంకేతాల నేపథ్యంలో కూడా సెప్టెంబర్‌ త్రైమాసికంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలను నమోదు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇన్వెంటరీ నష్టాలు, వినిమయం తగ్గడం కారణంగా పెరిగిన మార్జిన్ల నుంచి వచ్చే లాభాలు పరిమితం కావచ్చంటున్నారు. ప్రధానమైన ఓఎంసీలు నికర లాభంలో తరుగుదలకు క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం కారణం అవుతుంటాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర తొలి త్రైమాసికం చివర్లో, రెండో త్రైమాసికంలో

Most from this category