News


రాణిస్తున్న రియల్టీ షేర్లు

Monday 1st July 2019
Markets_main1561975326.png-26720

లాభాల మార్కెట్లో రియల్టీ షేర్లు రాణిస్తున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ సోమవారం 2శాతం ర్యాలీ చేసింది. బడ్జెట్‌ రియల్టీ రంగానికి అనుకూలంగా ఉండవచ్చనే ఆశావహంతో వరుసగా ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లో ఈ రంగ షేర్లు లాభాల బాటపట్టాయి. ఈ రంగంలో ప్రధాన షేర్లైన గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఒబేరాయ్‌ రియల్టీ ఇండెక్స్‌ షేర్లు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.2100 కోట్ల సమీకరణ ప్రక్రియను పూర్తి చేసిందనే వార్తలతో గ్రోదేజ్‌ కంపెనీ షేర్లలో కొనుగోళ్లు నెలకొన్నాయి. ఇంట్రాడేలో  7.50శాతం లాభపడి రూ.1,083.60ల వద్ద ఆల్‌టైంని తాకింది. సన్‌టెక్‌ 6శాతం, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 2.50శాతం, ఐబీఆర్‌ ఎస్టేట్స్‌ 2శాతం, ఒబేరాయ్‌ రియల్టీ, మహీంద్రా లైఫ్‌, డీఎల్‌ఎఫ్‌ షేర్లు 1.50శాతం చొప్పున పెరిగాయి. అలాగే బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇదే రంగానికి చెందిన ప్రిస్టేజ్‌ ఎస్టేట్స్‌ 3.50శాతం నష్టపోగా, శోభ ఎస్టేట్స్‌ 1శాతం వరకు క్షీణించాయి. మధ్యాహ్నం గం.3:20ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(రూ.284)తో పోలిస్తే 2.60శాతం లాభంతో రూ.292ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇదే సమయానికి.., నిఫ్టీ 75పాయింట్లు లాభపడి 11,863.15 వద్ద, సెన్సెక్స్‌ 278 పాయింట్లు పెరిగి 39,672.76 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

బడ్జెట్‌పై ఆశలు లేవు: అడ్రియన్‌ మోవత్‌

Monday 1st July 2019

‘ఆర్థిక జాగ్రత్తలు తీసుకోడానికి ప్రభుత్వానికి ఇదే మంచి సమయం. రాబోయే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ద్రవ్యలోటును తగ్గించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వవచ్చు’ అని ఈఎం ఈక్వీటీ వ్యూహకర్త అడ్రియన్‌ మోవత్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటలోలనే......  ఉద్దీపనలు వుండవు..       2019 బడ్జెట్‌పై ఎక్కువ ఆశలు లేవు. బడ్జెట్‌లో వెలువడే ఉద్దీపనలను ఏ విధంగా చూడాలని చాలా మంది అడుగుతున్నారు కానీ

మందగమన భయాలు ముగిసినట్లే!

Monday 1st July 2019

జేపీ మోర్గాన్‌  గత కొన్ని నెలలుగా ప్రపంచ ఎకానమీలన్నీ మందగమన భయాలను చవిచూశాయని, కానీ ఇకపై మందగమన భయం గత చరిత్రగా మారుతుందని జేపీ మోర్గాన్‌ సీనియర్‌ ఎకనమిస్టు జేమ్స్‌ గ్లాస్‌మన్‌ చెప్పారు. ఎకానమీలు మాంద్య భయాల నుంచి కోలుకుంటున్నాయన్నారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ద్వితీయార్ధంలో మంచి ప్రదర్శన చూపగలదని అంచనా వేశారు. యూఎస్‌, చైనా ట్రేడ్‌ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, మానిటరీ పాలసీ మరింత సడలించడంతో మార్కెట్లు గాడిన పడతాయన్నారు.

Most from this category