News


రియల్‌ ఎస్టేట్స్‌ షేర్ల భారీ పతనం

Monday 30th September 2019
Markets_main1569828941.png-28625

ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ షేర్ల భారీ పతనంతో సోమవారం నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 261.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సంస్థలో మోసం జరిగిందనే ఆరోపణలపై కోర్టు దర్యాప్తునుకు ఆదేశించిన నేపథ్యంలో తన సహచర కంపెనీ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఒకరోజులో అతిపెద్ద నష్టాన్ని చవిచూసి ఐదేళ్ల కనిష్టానికి పతనమైంది. ఈ ప్రభావంతో ఇదే గ్రూప్‌లో రియల్టీరంగంలో సేవలు అందించే ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ కంపెనీ షేర్లు 10శాతానికి పైగా పతనమైంది. రియల్టీ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన ఐబీఆర్‌ఈ షేర్ల భారీ పతనంతో ఇదే రంగంలో ఇతర షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. సన్‌టెక్‌, 5.50శాతం, ఒబేరాయ్‌ రియల్టీ 3శాతం, డీఎల్‌ఎఫ్‌ 2.50శాతం, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, శోభా 2శాతం నష్టపోయాయి. ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ 1.50శాతం, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ 1శాతం, ఫోనెక్స్‌ లిమిటెడ్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.  మరోవైపు మహీంద్రా లైఫ్‌ షేర్లు 1.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఐఆర్‌సీటీసీ ఐపీఓ: గంటలో 8 శాతం షేర్లకు బిడ్స్‌

Monday 30th September 2019

  ప్రభుత్వ సంస్థయిన ఐఆర్‌సీటీసీ ఐపీఓ(ఇనిసియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ రోజు ప్రారంభమయ్యింది. ప్రారంభమైన మొదటి గంటలోనే మొత్తం ఇష్యు చేసిన షేర్లలో 8 శాతం షేర్లకు బిడ్లు దాఖలు ఖావడం గమనార్హం. ఐఆర్‌సీటీసీ, ఐపీఓలో మొత్తం 2,01,60,000 షేర్లను అందుబాటులోకి తీసుకురాగా, ఉదయం 11 గంటల సమయానికి 16,06,560 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఐపీఓ ధర పరిధిని షేరుకు రూ. 315- 320 వద్ద ఐఆర్‌సీటీసీ నిర్ణయించిన విషయం

భారత్‌ 22 ఈటీఎఫ్‌ నాలుగో ఇష్యూ ఆకర్షణియం!

Monday 30th September 2019

-పీఎస్‌యూ స్టాకుల ర్యాలీతో స్వల్పకాలానికి ఈ ఈటీఎఫ్‌ మంచిదే -కానీ దీర్ఘకాల ఇన్వెస్టర్లు దూరంగా ఉండే అవకాశం: విశ్లేషకులు   ప్రభుత్వ రంగ కంపెనీలు, బ్యాంకులు, కొన్ని ప్రైవేట్‌ కంపెనీల స్టాకులను కలిగి ఉన్న భారత్‌ 22 ఈటీఎఫ్‌(ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) నాలుగో విడత ఇష్యు అక్టోబర్‌ 3 వ తేది నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఇష్యు ద్వారా రూ. 8,000 కోట్లను సమీకరించుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకొస్తుంది. అక్టోబర్‌ 3

Most from this category