News


అమ్మకాల ఒత్తిడిలో రియల్టీ షేర్లు

Monday 5th August 2019
Markets_main1564996212.png-27549

మార్కెట్‌ పతనంతో భాగంగా రియల్టీ రంగ షేర్లు సోమవారం ట్రేడింగ్ కుప్పకూలాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ నేడు బీఎస్‌ఈఓలో 3శాతం క్షీణించింది. నేడు ఇండెక్స్‌లో 258.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒక దశలో 3శాతం పతనమైన 253.80 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:00లకు ఇండెక్స్‌ గతముగింపు(262.60)తో పోలిస్తే దాదాపు 2శాతం నష్టంతో 257.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ కంపెనీ, డీఎల్‌ఎఫ్‌ షేర్లు 4శాతం పతనమయ్యాయి. ఫోనిక్స్‌ లిమిటెడ్‌, శోభా, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లు 2.50శాతం నష్టపోయాయి. అలాగే సన్‌టెక్‌ షేర్లు 2శాతం, ఒబేరాయ్‌ రియల్టీ , మహీంద్రా లైఫ్‌ లిమిటడ్‌ షేర్లు 1.50శాతం పతనయ్యాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని బ్రిగేడ్‌ ఇండస్ట్రీస్‌, ప్రెస్టెజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 1నుంచి 2శాతం లాభపడ్డాయి.



You may be interested

పతనానికి ప్రధాన కారణాలివే!

Monday 5th August 2019

దేశియ ఈక్విటీ మార్కెట్ల పతనం సోమవారం కూడా కొనసాగుతునే ఉంది. నిఫ్టీ కిలకమైన 10,850 స్థాయిని కాపాడుకోలేకపోయింది. ఆసియా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో పాటు, ట్రేడ్‌ వార్‌ భయాల వలన చైనా కరెన్సీ యువాన్‌ డాలర్‌ మారకంలో బలహీనపడడం ఇండియా మార్కెట్లపై ప్రభావం చూపింది. చైనా పీఎంఐ డేటా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని స్పష్టం చేయడం, గత వారం వెలువడిన ఫెడ్‌ సమావేశం ఫలితాలు కూడా మార్కెట్‌

వృద్ధి 9 శాతం సాధించాలి..

Monday 5th August 2019

అప్పుడే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యం ఈవై నివేదిక న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించుకున్నట్లుగా భారత్ 5 లక్షల కోట్ల (ట్రిలియన్‌) డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే వరుసగా అయిదేళ్ల పాటు ఏటా 9 శాతం మేర వృద్ధి చెందాల్సి ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై పేర్కొంది. అలాగే, మొత్తం పెట్టుబడుల రేటు కూడా స్థూల దేశీయోత్పత్తిలో 38 శాతానికి పెరగాల్సి ఉంటుందని ఎకానమీ వాచ్ పేరిట రూపొందించిన ఒక

Most from this category