News


పాజిటివ్‌గా రియల్టీ..డీఎల్‌ఎఫ్‌ 6% ర్యాలీ!

Monday 14th October 2019
Markets_main1571032955.png-28869

 దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో పాటు, ఆర్‌బీఐ రేట్‌ను  బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేస్తుండడంతో సోమవారం రియల్టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.  ఓక్‌ట్రీ క్యాపిటల్‌తో నాన్‌ బైండింగ్‌ టెర్మ్‌ షీట్‌ ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు, సిద్ధంగా ఉన్న 376 లక్సరీ ప్లాట్‌లను గురుగ్రామ్‌లోని తన హౌసింగ్‌ ప్రాజెక్టును ప్రారంభించిన మొదటి రోజునే డీఎల్‌ఎఫ్‌ రూ. 700 కోట్లకు విక్రయించడంతో సోమవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరువిలువ 6.52 శాతం లాభపడి రూ. 155.10 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ షేరుతో పాటు బై బ్యాక్‌ను ప్రకటించడంతో ఇండియాబుల్స్‌ రియల్టీ షేరు 4.95 శాతం లాభపడి రూ. 45.55 వద్ద అప్పర్‌ సర్యూట్‌ను తాకింది. వీటీ ప్రభావంతో ఉదయం 11.22 సమయానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3.32    శాతం లాభపడి 255.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇతర షేర్లయిన గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 3.32 శాతం, సన్‌టెక్‌ 2.69 శాతం, ఓబ్‌రాయ్‌ రియల్టీ 2.26 శాతం, ప్రెస్టెజ్‌ ప్రాపర్టీస్‌ 1.79 శాతం, శోభ 1.51 శాతం, మహింద్రా లైఫ్‌ స్పేస్‌ డెవలపర్స్‌ 1.21 శాతం, ఫియెనిక్స్‌ మిల్స్‌ 1.00 శాతం, బ్రిగేడ్‌ 0.18 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. 



You may be interested

టాటా మోటర్స్‌ జోరు: లాభాల బాటలో అటో షేర్లు

Monday 14th October 2019

టాటా మోటర్స్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో నేటి ఉదయం సెషన్‌లో 6శాతానికి పైగా ర్యాలీ చేశాయి. నేడు  ఈ కంపెనీ షేర్లు రూ.122.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. టాటా మోటార్స్‌కు చెందిన అతిపెద్ద అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు చైనాతో పాటు అమెరికాలోనూ మంచి మార్కెట్ ఉంది. ఇటీవల ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య సంధితో రెండు దేశాల్లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు

స్థిరంగా పసిడి ధర

Monday 14th October 2019

అమెరికా చైనాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందంతో కిత్రం వారం ముగింపు రోజున భారీ పతనమైన పసిడి ధర సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు అదే స్థాయిలో స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం గం.11:10ని.లకు ఔన్స్‌ పసిడి ధర 3 డాలర్ల స్వల్ప లాభంతో 1,491.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాబోయే రోజుల్లో పసిడి ధరకు బ్రిగ్జిట్‌, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల అంశాలు కీలకం కానున్నాయి.

Most from this category