News


డీఎల్‌ఎఫ్‌ భారీ పతనం..నష్టాల్లో రియల్టీ షేర్లు

Thursday 22nd August 2019
Markets_main1566450583.png-27940

హర్యానాలోని డీఎల్‌ఎఫ్‌ ల్యాండ్‌-బ్యాంక్‌పై కొనసాగుతున్న న్యాయసంబంధిత విషయాలను డీఎల్‌ఎఫ్‌ తన షేర్‌హోల్డర్ల నుంచి దాచి పెట్టిందని సుప్రీం కోర్టు ఈ సంస్థకు నోటిసులను జారీ చేసింది ఫలితంగా ఈ సంస్థ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోతున్నాయి. డీఎల్‌ఎఫ్‌ దెబ్బతో ఇతర రియల్‌ఎస్టేట్‌ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఉదయం 10.12 సమయానికి 6.30 శాతం నష్టపోయి 242.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో డీఎల్‌ఎఫ్‌ 17.28 శాతం నష్టపోయింది. దీనితో పాటు ఒబేరాయ్‌ రియల్టీ 4.21 శాతం, ఇండియాబుల్స్‌ రియలెస్టేట్‌ 3.51 శాతం, సన్‌టెక్‌ 3.37 శాతం, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 2.53 శాతం, శోభా 1.86 శాతం, బ్రిగేడ్‌ ఇండస్ట్రీస్‌ 1.56 శాతం, ప్రెస్టెజ్‌ ఇండస్ట్రీస్‌ 1.55 శాతం, మహీంద్రా లైఫ్‌ లిమిటడ్‌ 0.61 శాతం, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 0.34 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.
 



You may be interested

కుప్పకూలిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు

Thursday 22nd August 2019

గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్లు కుప్పకులాయి. ఈ రంగంలోని ప్రధాన కంపెనీ షేర్లైన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హుడ్కో, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, ఆర్‌జీఐ హోమ్స్‌ ఫైన్సా్‌, ఇండియా హోమ్స్‌ లోన్స్‌ షేర్లు దాదాపు 5శాతం నుంచి 9 శాతం క్షీణించాయి.  ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైన్సా్‌న్స్‌:-  ఫిడిలిటీ మేనేజ్‌మెంట్‌ రూ.1261 కోట్లకు

పెరిగిన చమురు!

Thursday 22nd August 2019

యుఎస్‌ క్రూడ్‌ నిల్వలు అగష్టు 16తో ముగిసిన వారంలో అంచనాల కంటే తగ్గడంతో చమురు ధరలు గురువారం పెరిగాయి. కానీ అంతర్జాతీయ మందగమన భయాలు, చమురు డిమాండ్‌ దృక్పథం, పెరుగుతున్న ఇతర ఇంధన నిల్వలు చమురు లాభాలను పరిమితం చేస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బారెల్‌ 60.57 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.6 శాతం పెరిగి బారెల్‌ 56.03 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. రిఫైనరీలు ఉత్పత్తిని

Most from this category