News


డీఎల్‌ఎఫ్‌ 6% అప్‌

Tuesday 22nd October 2019
Markets_main1571729560.png-29054

 డీఎల్‌ఎఫ్‌ మంగళవారం ట్రేడింగ్లో మూడు నెలల గరిష్ఠానికి చేరుకోవడంతో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ పాజిటివ్‌గా కదులుతోంది. మధ్యాహ్నాం 12.54 సమయానికి 0.99 శాతం లాభపడి 265.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో డీఎల్‌ఎఫ్‌ షేరు 6.01 శాతం లాభపడి రూ. 179.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 168.85 వద్ద ముగిసిన ఈ కంపెనీ షేరు, మంగళవారం సెషన్‌లో రూ. 170.00 వద్ద  పాజిటివ్‌గా ప్రారంభమై, రూ. 183.00 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 
   ఈ ఇండెక్స్‌లో ఇతర షేర్లయిన ఇండియా బుల్స్‌ రియల్టీ 4.52 శాతం, బ్రిగేడ్‌ 2.78 శాతం, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 0.35 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఓబ్‌రాయ్‌ రియల్టీ 3.74 శాతం, సన్‌టెక్‌ 2.84 శాతం,  ప్రెస్టెజ్‌ ప్రాపర్టీస్‌ 2.13 శాతం, శోభ 1.48 శాతం, మహింద్రా లైఫ్‌ స్పేస్‌ డెవలపర్స్‌ 0.57 శాతం, ఫియెనిక్స్‌ మిల్స్‌ 0.05    శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. 


DLF

You may be interested

జోరుగా ఫైనాన్షియల్‌ షేర్ల ర్యాలీ

Tuesday 22nd October 2019

గత ఆరునెలలుగా నష్టాలను చవిచూస్తున్న ఆర్థిక రంగ షేర్లు మంగళవారం భారీగా లాభాల్ని ఆర్జిస్తున్నాయి. వచ్చే ఆర్‌బీఐ సమావేశంలో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ఊరట కలిగించే అంశాలను ప్రకటించవచ్చనే అంచనాలు ఈ షేర్లకు డిమాండ్‌ పెంచుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫైనాన్షియల్‌ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. ఇండెక్స్‌ అత్యధికంగా ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ సర్వీసెస్‌

రికార్డు స్థాయికి ఐసీఐసీఐ బ్యాంక్‌

Tuesday 22nd October 2019

ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు విలువ మంగళవారం సెషన్‌లో మరోదఫా రికార్డుస్థాయిని చేరింది. గత నెలలో కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు సమయంలో నెలకొల్పిన రూ. 458.65 స్థాయిని తిరిగి ఈ రోజు ఐసీఐసీఐ బ్యాంక్‌ టచ్‌చేయడం విశేషం.  మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు విలువ 4.5 శాతం లాభపడి రూ. 458.70 స్థాయికి చేరింది. గత సెషన్లో రూ. 437.80 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్లో రూ.

Most from this category