News


కదంతొక్కిన రియాల్టీ షేర్లు

Thursday 2nd January 2020
Markets_main1577961868.png-30624

రియల్టీ రంగ షేర్ల ర్యాలీ కారణంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ గురువారం 1శాతానికి పైగా లాభంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో రియల్‌ ఎస్టేట్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ నేడు 299.15 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ట్రేడింగ్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు రియల్టీ రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1.52శాతం లాభపడి 302.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 0.92శాతం లాభంతో 300.60 వద్ద స్థిరపడింది. ఈ రంగానికి చెందిన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు అత్యధికంగా 10శాతం లాభంతో ముగిసింది. డీఎల్‌ఎఫ్‌ 3శాతం, సన్‌టెక్‌ 2.50శాతం లాభపడ్డాయి. బ్రిగేడ్‌ ఎస్టేట్స్‌, శోభ షేర్లు 2శాతం పెరిగాయి. ఓబెరాయ్‌ రియల్టీ 1.25శాతం ర్యాలీ చేసింది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 2.50శాతం నష్టపోయింది. ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ షేర్లు 2శాతం, మహీంద్రా లైఫ్‌, ఫోనిటెక్స్‌ లిమిటెడ్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. 



You may be interested

రూ.లక్ష కోట్లతో.. లాభపడే కంపెనీలు

Thursday 2nd January 2020

మౌలిక రంగ ప్రాజెక్టులపై 2024 నాటికి రూ.105 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో మౌలిక రంగంలోని కంపెనీలు సమీప భవిష్యత్తులో ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలను ఇస్తాయనే విశ్లేషణనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని ప్రకటించినప్పటికీ... ఆచరణలో మాత్రం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులే వ్యయాలను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.    ‘‘ప్రభుత్వ లక్ష్యం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. గత పదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాలపై

అంచనాలే అంతిమం కాదు!

Thursday 2nd January 2020

సమయానుగుణంగా మార్చుకోవాలి లేదంటే బకరా అవడం ఖాయం సీనియర్‌ అనలిస్టు సీకే నారాయణ్‌ ‘‘అప్పుడప్పుడు ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేయాలోయ్‌!’’ అని కన్యాశుల్కంలో గిరీశం తన శిష్యుడికి హితోపదేశం చేస్తాడు. ఈ సూత్రం ఆ శిష్యుడికి పనికివచ్చిందో లేదో కానీ, మార్కెట్లో మదుపరికి మాత్రం తారకమంత్రంతో సమానమని సీనియర్‌ అనలిస్టు సీకే నారాయణ్‌ చెబుతున్నారు. మార్కెట్లకు అనుగుణంగా మన అంచనాలను మార్చుకోవాలని, మూర్ఖంగా తా పట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్లు ఒక అంచనా ఏర్పరుచుకొని, అందుకు రివర్సులో

Most from this category