News


రియల్టీ రంగానికి ఆర్‌బీఐ రిలీఫ్‌: హెచ్‌ఎఫ్‌సీ షేర్ల ర్యాలీ

Thursday 6th February 2020
Markets_main1580982150.png-31568

నిర్మాణాలు వాస్తవంగానే ఆలస్యమైన కమర్షియల్‌ రియాల్టీ రుణాలను డౌన్‌గ్రేడ్ చేయబోమంటూ ఆర్‌బీఐ ప్రకటించడటంతో గురువారం రియాల్టీ కంపెనీల షేర్లతో పాటు హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వాణిజ్య ప్రాతిపదికన ప్రాజెక్ట్‌లు అనుకోని పరిస్థితుల్లో ఆలస్యమైనప్పటికీ.., మరో ఏడాది పాటు గడువు పొడిగించేందుకు ఆర్‌బీఐ తాజా పాలసీలో నిర్ణయించింది. అంతేకాకుండా ఆలస్యమైన ప్రాజెక్ట్‌లను డౌన్‌గ్రేడ్‌ చేయరు. ఇన్ఫ్రాయేతర రంగాల ప్రాజెక్ట్‌లకు కల్పించే సదుపాయాలకు వీటికీ వర్తింపచేస్తారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సి) నియంత్రణకు సవరించిన ముసాయిదా నిబంధనలు ఫిబ్రవరి 29 లోగా ముగియనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఆర్‌బీఐ నిర్ణయం హర్షించదగినదని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీస్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పూరి అభిప్రాయపడ్డారు. ద్రవ్య కొరత సమస్యతో సతమతవుతున్న రియల్టీ రంగానికి, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపనీలకు మంచి ఆర్‌బీఐ నిర్ణయం ఉపశమనాన్ని కలిగించే అంశమని చెప్పవచ్చు. నగదు ప్రవాహ పెంచడంతో పాటు నిర్మాణాలు సకాలంలో పూర్తి అయ్యేందుకు తోడ్పాటునిస్తుందని అనూజ్ పూరి తెలిపారు. ఆర్‌బీఐ నిర్ణయంతో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌, ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పీఈఎల్‌, ఎల్‌ఐటీ ఫైన్సాన్స్‌ కంపెనీలకు లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

నేడు ఇంట్రాడే ఎన్‌ఎస్‌ఈలో రియల్‌ ఎస్టేట్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 2శాతం వరకు లాభపడింది. ఈ రంగానికి చెందిన బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, శోభ, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఓబేరాయ్‌ రియల్టీ, ఫోనిక్స్‌ మిల్స్‌ షేర్లు 3శాతం నుంచి 1శాతం వరకు లాభపడ్డాయి. ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, సన్‌టెక్‌ రియల్టీ షేర్లు 1శాతం వరకు పెరిగాయి. 

హౌసింగ్‌ పైనాన్స్‌ రంగానికి చెందిన ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరుఅత్యధికంగా 15శాతం పెరిగింది. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 8శాతం, పీఎన్‌ఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, దీవాన్‌ హౌసింగ్‌ షేర్లు 5శాతం లాభపడ్డాయి. హడ్కో, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియా బ్యాంక్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కెన్‌ ఫిన్‌ సర్వీసెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 2శాతం నుంచి 1శాతం ర్యాలీ చేశాయి. You may be interested

ఫార్మా షేర్లలో బుల్‌ ట్రెండ్‌ షురూ?!

Thursday 6th February 2020

6-12 నెలల్లో ఫార్మా స్టాక్స్‌లో ర్యాలీ 30 శాతం రిటర్నులకు చాన్స్‌? గోల్డిలాక్స్‌ ప్రీమియమ్‌ రీసెర్చ్‌ అంచనా గతేడాది(2019) మార్కెట్లలో దూకుడు చూపిన స్టాక్స్‌ ఈ ఏడాది(2020)లో వెనకసీట్లో కూర్చుంటాయని గోల్డిలాక్స్‌ ప్రీమియమ్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకులు గౌతమ్‌ షా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు దూకుడు చూపే వీలున్నట్లు చెబుతున్నారు. ఫార్మా రంగంలో బుల్‌ ట్రెండ్‌ ఇప్పుడే ప్రారంభమైనట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్కెట్లతోపాటు.. మెటల్స్‌, ఆటో, రియల్టీ తదితర

ఎఫ్‌పీఐ పరిమితి పెంపుతో పీఎస్‌యూలకే లాభం!

Thursday 6th February 2020

కార్పొరేట్‌ బాండ్స్‌లో పెరగనున్న విదేశీ పెట్టుబడులు కార్పొరేట్‌ బాండ్స్‌లో ఎఫ్‌పీఐల పరిమితి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పీఎస్‌యూ కంపెనీలకు మేలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పీఎస్‌యూ కంపెనీలతో పాటు ఏఏఏ రేటింగ్‌ ఉన్న కంపెనీలు కూడా ఈ నిర్ణయంతో మేలు పొందుతాయంటున్నారు. అయితే ఈ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చన్నారు. కార్పొరేట్‌ బాండ్స్‌లో ఎఫ్‌పీఐల వాటా పరిమితిని 9 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్రం బడ్జెట్లో నిర్ణయం తీసుకుంది.

Most from this category