News


ఎంఎస్‌సీఐ ఇండియా సూచీలోకి కొత్త చేరికలు

Thursday 9th May 2019
Markets_main1557425184.png-25641

ఎంఎస్‌సీఐ ఇండియా ఆరు నెలలకోసారి సూచీల్లో మార్పులను ఈ నెల 13న సమీక్షించాల్సి ఉంది. ఐసీఐసీఐ డైరెక్ట్‌ నివేదిక ప్రకారం... బ్యాంకింగ్‌, బీమా కంపెనీలకు కొత్తగా చోటు లభించనుంది. ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను ఈ సూచీలో చేర్చే అవకాశాలున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా. అధికారికంగా ఈ మార్పులపై ఈ నెల 13న ప్రకటన వెలువడనుంది. ఈ నెల 29 నుంచి ఆ మేరకు సూచీల్లో మార్పులు అమల్లోకి వస్తాయి.

 

భారత మార్కెట్లో లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ విభాగాల కంపెనీల పనితీరును ప్రతిబింబించే విధంగా ఎంఎస్‌సీఐ ఇండియా సూచీని రూపొందించడం జరిగింది. ఈ సూచీని ప్రతీ త్రైమాసికానికి ఓ సారి... ఏటా ఫిబ్రవరి, మే, ఆగస్ట్‌, నవంబర్‌లో సమీక్షించడం జరుగుతోంది. అంతర్లీన ఈక్విటీ మార్కెట్లకు అనుగుణంగా వీటిల్లో మార్పులు చేయడమే ఈ సమీక్ష ఉద్దేశం. అలాగే, ఏటా మే, నవంబర్‌లో అర్ధ సంవత్సర సమీక్షలు కూడా ఉంటాయి. ఈ సమయంలో సూచీని రీబ్యాలన్స్‌ చేయడం కూడా జరుగుతుంది. ఎంఎస్‌సీఐ అంతర్జాతీయ పెట్టుబడుల సూచీల విధానాలకు లోబడి ఈ సూచీలో స్టాక్స్‌ చేరికల అర్హతలు ఆధారపడి ఉంటాయి. 1969 నుంచి ఎంఎస్‌సీఐ గ్లోబల్‌ ఈక్విటీ సూచీలు పనిచేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోకు దీన్ని బెంచ్‌మార్క్‌గా తీసుకుంటారు. ఇండెక్స్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌లు ఈ సూచీలను అనుసరిస్తుంటాయి. అందుకే దీనికి అంత ప్రాధాన్యం. ‘‘ఎంఎస్‌సీఐ ఇండియా సూచీలో మన మార్కెట్లకు సంబంధించి 85 శాతం కవరేజీ ఉంది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు ఎక్కువ వెయిటేజీ ఉండగా, ఆ తర్వాత టెక్నాలజీ రంగానికి ఉన్నది. ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌ నిర్వహణలోని ఐషేర్స్‌ ఎంఎస్‌సీఐ ఇండియా ఈటీఎఫ్‌ కింద 5.05 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. అలాగే, మరెన్నో ఇతర అంతర్జాతీయ ఫండ్స్‌, తమ పెట్టుబడులకు ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి’’ అని ఐసీఐసీఐ డైరెక్ట్‌ నివేదిక పేర్కొంది.  

 

ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లోని టాప్‌-10 కంపెనీల్లో ప్రస్తుతం 11.53 శాతం వెయిటేజీతో ఆర్‌ఐఎల్‌ మొదటి స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీకి 9.46 శాతం, ఇన్ఫోసిస్‌కు 7.62 శాతం, టీసీఎస్‌కు 5.91 శాతం, యాక్సిస్‌ బ్యాంకుకు 4.23 శాతం, హెచ్‌యూఎల్‌కు 3.31 శాతం, ఐటీసీకి 3 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.82 శాతం, మారుతి సుజుకీ ఇండియాకు 2.05 శాతం, ఎల్‌అండ్‌టీకి 1.87 శాతం వెయిటేజీ ఉన్నది. You may be interested

బేర్‌ మార్కెట్‌ రాబోతున్నది: జిమ్‌ రోగర్స్‌

Thursday 9th May 2019

ఇన్వెస్ట్‌మెంట్‌ గురు జిమ్‌ రోగర్స్‌ త్వరలోనే బేర్‌ మార్కెట్‌ వస్తుందన్న అంచనాతో ఉన్నారు. త్వరలో వచ్చే బేర్‌ మార్కెట్‌ తన జీవితంలోనే అత్యంత దారుణంగా ఉంటుందని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. తాను పెరిగే మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయనని, పడిపోయే మార్కెట్లలోనే పెట్టుబడులు పెడతానన్నారు. భారత ప్రధాని మోదీ చెప్పుకోతగ్గ పెద్ద మొత్తంలో ఏమీ చేయలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ

ఏడురోజూ నష్టాలే..!

Thursday 9th May 2019

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనంతో మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. ఎనర్జీ, ఇంధన, ఫార్మా, పవర్‌ రంగ షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 230 పాయింట్లు నష్టపోయి 37,559 వద్ద, నిఫ్టీ 57.65 పాయింట్లు నష్టపోయి 11,301.80 వద్ద ముగిసింది. సూచీలు ఇది వరుసగా ఏడోరోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య వివాదం మరింత ముదరడంతో అటు

Most from this category