News


ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌కు రేటింగ్‌ షాక్‌..!

Wednesday 23rd October 2019
Markets_main1571825854.png-29084

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో గురువారం ఆర్‌బీఎల్‌ షేర్లు రికార్డు కనిష్టస్థాయికి పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.258.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ ఏడాది క్యూ2లో బ్యాంక్‌ నికర లాభం 73శాతం క్షీణించి రూ. 54.3 కోట్లకు పరిమితమైంది. స్థూల ఎన్‌పీఏలు 1.38 శాతం నుంచి 2.6 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.65 శాతం నుంచి 1.56 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు రూ. 140 కోట్ల నుంచి రూ. 533 కోట్లకు ఎగిశాయి. నికర వడ్డీ ఆదాయం మాత్రం 46 శాతం పుంజుకుని రూ. 869 కోట్లకు చేరింది. ప్రోవిజన్ల కేటాయింపు అధికం కావడంతో కంపెనీ ఫలితాలపై తీవ్ర ప్రతికూలతను చూపినట్లు బ్యాంక్‌ ఎండీ విశ్వవిహార్‌ అహుజా తెలిపారు. కార్పోరేట్‌ రుణాలను తిరిగి చెల్లించడంలో జాప్యం చేయడంతో ఈ క్యూ2లో కంపెనీ ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవచ్చని కొన్ని నెలల క్రితం తెలిపింది. ఫలితాలు తీవ్రంగా నిరాశపరచడంతో పలు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు ఈ బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో షేర్లు 19.50శాతం క్షీణించి రూ.230.55 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ ముగిసే సరికి 9.64శాతం నష్టంతో రూ.259.25 వద్ద స్థిరపడ్డాయి. ఆయా రేటింగ్‌ ఏజెన్సీలు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను ఇలా తగ్గించాయి.....



You may be interested

స్వల్ప లాభంతో ముగింపు

Wednesday 23rd October 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య ట్రేడైన సూచీలు చివరికి స్వల్ప లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 95 పాయింట్ల లాభంతో 39,059 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 11,604 వద్ద స్థిరపడ్డాయి. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానుండటం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితి తదితర అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, అటో, ఆర్థిక ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, ఫార్మా షేర్లుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు

21.69% పెరిగిన బజాజ్‌ ఆటో నికర లాభం!

Wednesday 23rd October 2019

  బజాజ్‌ ఆటో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో స్టాండ్‌ఎలోన్‌ నికర లాభాన్ని  రూ. 1,402.42 కోట్లుగా ప్రకటించింది. ఇది గతేడాది రూ. 1,152.48 కోట్లు కంటే 21.69 శాతం అధికం కావడం గమనార్హం. ఈ లాభం రూ. 1,150 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు.     కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో బజాజ్‌ ఆటో పన్ను వ్యయం సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 206.49 కోట్లకు

Most from this category