News


కొత్త కనిష్టానికి ఆర్‌బీఎల్‌, బంధన్‌ బ్యాంక్‌

Monday 9th March 2020
Markets_main1583748016.png-32371

16 శాతం కుప్పకూలిన ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
8 శాతం పతనమైన బంధన్‌ బ్యాంక్‌ షేరు
ఐపీవో ధరలకంటే దిగువకు చేరిన కౌంటర్లు

ఉన్నట్టుండి కుప్పకూలుతున్న ప్రపంచ మార్కెట్ల బాటలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం బేర్‌మంటున్నాయి. భారీ అమ్మకాలతో సెన్సెక్స్‌ 2000 పాయింట్లవరకూ పడిపోగా.. నిఫ్టీ సైతం ఏకంగా 500 పాయింట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో అన్ని రంగాల కౌంటర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్లకు భారీ అమ్మకాల సెగ తగులుతోంది. ఇటీవల ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ బోర్డును రద్దు చేయడంతోపాటు.. నగదు ఉపసంహరణపై రిజర్వ్‌ బ్యాంక్‌ పరిమితులు విధించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర వివరాలు చూద్దాం..

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
ఇటీవల నికర మొండిబకాయిల(ఎన్‌పీఏలు) సమస్యలతో నేలచూపులకు లోనవుతున్న ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కౌంటర్లో తాజాగా అమ్మకాలు పెరిగాయి. దీంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 18 శాతం కుప్పకూలింది. రూ. 212కు చేరింది. ఇది సరికొత్త కనిష్టంకావడం గమనార్హం. అంతేకాకుండా పబ్లిక్‌ ఇష్యూ ధర రూ. 225 కంటే దిగువకు చేరింది. సాయంత్రం 3.15 ప్రాంతంలో ఈ షేరు 16 శాతం నష్టంతో రూ. 217 వద్ద కదులుతోంది. ఇటీవల ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు జేపీ మోర్గాన్‌ అండర్‌వెయిట్‌ రేటింగ్‌ను ప్రకటించింది. BB, BBB రేటింగ్‌లతో కూడిన రిస్క్‌ అసెట్స్‌, మధ్యస్థాయి కార్పొరేట్‌ కంపెనీలకు అధిక రుణాలు వంటి అంశాలు అండర్‌వెయిట్‌ రేటింగ్‌కు కారణమైనట్లు జేపీ మోర్గాన్‌ పేర్కొంది.

బంధన్‌ బ్యాంక్‌
మార్కెట్లలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. సాయంత్రం 3.15 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో బంధన్‌ బ్యాంక్‌ షేరు 8 శాతం పతనమై రూ. 373 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 9 శాతం నీరసించి రూ. 368ను తాకింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. పబ్లిక్‌ ఇష్యూ ధర రూ. 375 కంటే దిగువకు చేరింది. 2018 మార్చిలో బంధన్‌ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. అస్సాంలో నిరసనలు, అధిక లెవరేజింగ్‌ వంటి అంశాలు కొంతమేర ఈ కౌంటర్లో అమ్మకాలకు కారణమవుతున్నట్లు జేపీ మోర్గాన్‌ పేర్కొంది.



You may be interested

యస్‌ బ్యాంక్‌ విత్‌డ్రాయిల్‌ పరిమితి ఈ నెల 15 వరకే!

Monday 9th March 2020

యస్‌బ్యాంకు ఖాతాదారులు మార్చి 15 తర్వాతా ఎటువంటి పరిమితి లేకుండా తమ నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. యస్‌బ్యాంక్‌పై  ఆర్బీఐ మారటోరియం విధిస్తూ రూ.50,000 వరకు ఖాతాదారులు తమ అకౌంట్‌ల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని ఇటీవల ప్రకటించింది. ఈ విత్‌డ్రాయల్‌ను మార్చి 15 వరకే పరిమితం చేసి తర్వాతా ఎత్తివేశే అవకాశం ఉందని  కొత్తగా నియమితులైన యస్‌బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎస్‌బీఐ మాజీ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. కాగా

పదేళ్ల అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన రిలయన్స్‌ షేరు

Monday 9th March 2020

ఇంట్రాడేలో 13.50శాతం నష్టపోయిన షేరు క్రూడాయిల్‌ పతనంతో సౌదీ ఆర్‌కాం అనుమానాలు దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు సోమవారం పదేళ్లలో అతిపెద్ద ఇంట్రాడే నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ భారీ పతనం నేపథ్యంలో సౌదీ ఆరాం కో కుదుర్చుకున్న ఒప్పందంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఫలితంగా రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నేటి ట్రేడింగ్‌లో ఏకంగా 13.50శాతం నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయ వృద్ధి మందగమన నేపథ్యంలో క్రూడాయిల్‌ ఉత్పత్తి

Most from this category