News


మెరుగైన రిస్క్‌ టూల్స్‌ను అనుసరించాలి

Tuesday 5th November 2019
Markets_main1572925128.png-29348

  • తగినంత లిక్విడిటీ కలిగి ఉండాలి
  • ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) మెరుగైన రిస్క్‌ నిర్వహణ విధానాలను అనుసరించాలని ఆర్‌బీఐ కోరింది. అలాగే, నిర్దేశించిన లిక్విడిటీ కవరేజీ రేషియో (నిధుల నిర్వహణ నిష్పత్తి)కు అనుగుణంగా తగినంత నిధులను కలిగి ఉండాలని ఆదేశించింది. రూ.10,000 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తులను కలిగిన ఎన్‌బీఎఫ్‌సీలు, అలాగే, డిపాజిట్లను స్వీకరించని అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి నూతన నిబంధనలను ఆర్‌బీఐ ఇటీవలే విడుదల చేసింది. నూతన నిబంధనలను 2020 డిసెంబర్‌ నుంచి కచ్చితంగా ఆచరించాలని నిర్దేశించింది. లిక్విడిటీ కవరేజీ రేషియోలో కనీసం 50 శాతం అధిక నాణ్యతతో కూడిన లిక్విడిటీ ఆస్తులను కలిగి ఉండాలని, 2024 డిసెంబర్‌ నాటికి 100 శాతానికి దీన్ని తీసుకెళ్లాలని తన ఆదేశాల్లో ఆర్‌బీఐ పేర్కొంది. 
పారితోషికంపై నూతన నిబంధనలు
విదేశీ, ప్రైవేటు, స్మాల్‌ ఫైనాన్స్‌, పేమెంట్‌ బ్యాంకులు, లోకల్‌ ఏరియా బ్యాంకుల్లో హోల్‌టైమ్‌ డైరెక్టర్లు, సీఈవోలకు చెల్లించే పారితోషికం విషయమై ఆర్‌బీఐ నూతన నిబంధనలను విడుదల చేసింది. వేరియబుల్‌ పే(పనితీరు ఆధారంగా చేసే చెల్లింపులు)ల్లో నగదు పరిమాణం 67 శాతానికి మించరాదని నిర్దేశించింది. తమ ఉద్యోగులకు సంబంధించి సమగ్ర చెల్లింపుల విధానాన్ని బ్యాంకులు రూపొందించుకోవాలని, వార్షికంగా వాటిని సమీక్షించాలని పేర్కొంది. 



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌పై దివాలా పిటీషన్లు!!

Tuesday 5th November 2019

బాకీలు రాబట్టుకునేందుకు వెండార్ల యోచన 19న నిరసన ప్రదర్శన న్యూఢిల్లీ: నష్టాలు, రుణాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెల్కోలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఓవైపు ప్యాకేజీ ప్రకటించగా.. మరోవైపు.. వాటి నుంచి వేల కోట్ల బాకీలు రాబట్టుకునేందుకు వెండార్లు సిద్ధమవుతున్నారు. బాకీలు వసూలు కాని పక్షంలో ఆ రెండు సంస్థలపై దివాలా పిటీషన్లు వేయాలని వివిధ యంత్ర పరికరాలు సరఫరా చేసిన వెండార్లు యోచిస్తున్నారు. ఈ బాకీలు సుమారు రూ. 20,000

అశోక్‌లేలాండ్‌ బీఎస్‌-6 వాహనాలు

Tuesday 5th November 2019

చెన్నై: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌లేలాండ్‌.. భారత్‌ స్టేజ్‌ ప్రమాణాలకు అనుగుణంగా తన భారీ శ్రేణి వాహనాలను ఆవిష్కరించింది. కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా సీట్లు, స్టీరింగ్‌ వంటి వాటిని మార్చుకుని కొనుగోలు చేసే సౌకర్యాన్ని వీటిలో అందుబాటులో ఉంచింది. మాడ్యులర్‌ బిజినెస్‌ ప్రోగ్రామ్‌గా పిలిచే ఈ విధానం టైలర్‌మేడ్‌ తరహాలో ఉంటుందని వివరించింది. మరిన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందుతున్న ఈ నూతన తరం వాహనాలు వచ్చే ఏడాది

Most from this category