News


చెక్కుల క్లియరింగ్‌ మరింత వేగంగా..

Friday 7th February 2020
Markets_main1581014954.png-31573

చెక్కులను ఎక్కువగా వినియోగించే వారిని సంతోషపెట్టే నిర్ణయం ఆర్‌బీఐ తీసుకుంది. చెక్‌ ట్రంకేషన్‌ సిస్టమ్‌ (సీటీఎస్‌)ను 2020 సెప్టెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్టు శుక్రవారం ఎంపీసీ ప్రకటనలో భాగంగా వెల్లడించింది. ప్రస్తుతానికి సీటీఎస్‌ విధానం అమల్లో ఉంది కానీ, పెద్ద క్లియరింగ్‌ హౌసెస్‌ మధ్యే ఉందని ఆర్‌బీఐ స్పస్టం చేసింది. అంటే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల మధ్య లేదు. సీటీఎస్‌తో చెక్కుల క్లియరింగ్‌కు రోజుల తరబడి సమయం పట్టదు. క్లియరింగ్‌ వేగంగా, భద్రంగా జరుగుతుంది.

 

సీటీఎస్‌ అంటే..?
ఈ విధానంలో ఫిజికల్‌ చెక్‌ల రవాణా ఉండదు. దీనికి బదులు చెక్‌ డిజిటల్‌ ఇమేజ్‌ను, ఎంఐసీఆర్‌ బ్యాండ్‌ తదితర సమాచారం క్లియరింగ్‌ హౌస్‌ ద్వారా పేయింగ్‌ బ్యాంకుకు పంపడం జరుగుతుంది. ఖాతాదారుడు చెక్కు జమ చేసిన బ్యాంకు శాఖ నుంచి పేయీ బ్యాంకుకు ఆ చెక్కును క్లియరింగ్‌ కోసం పంపాల్సిన అవస్థ ఈ వ్యవస్థలో ఉండదు. ఎలక్ట్రానిక్‌ రూపంలోనే ప్రక్రియ అంతా జరిగిపోతుంది.

 

ప్రయోజనాలు..
చెక్కు కలెక్షన్‌ను సీటీఎస్‌ వేగంగా చేసేస్తుంది. దీంతో కస్టమర్లు వేగంగా చెక్కును నగదుగా మార్చుకోగలరు. వేగంగా అంటే జమ చేసిన 24 గంటల్లోపు పూర్తవుతుందని ఆశించొచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది. చెక్కుల కలెక్షన్‌ చార్జీలు కూడా తగ్గిపోతాయి. అలాగే, రవాణాలో కనిపించకుండాపోవడం, దుర్వినియోగానికి కూడా అవకాశం ఉండదు. ఎన్ని ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల సాధనాలు వచ్చినప్పటికీ.. వ్యాపార నిర్వహణలో చెక్కుల వినియోగం చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఉంది. అందుకే ఆలస్యంగా అయినా చెక్కుల డిజిటల్‌ క్లియరింగ్‌కు సంబంధించిన సీటీఎస్‌ను ఆర్‌బీఐ దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తోంది. You may be interested

లక్ష్మీ విలాస్‌ బ్యాంకు ఎవరి చేతికి వెళుతుందో.?

Friday 7th February 2020

లక్ష్మీ విలాస్‌ బ్యాంకు, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విలీన ప్రతిపాదనకు ఆర్‌బీఐ నో చెప్పిన నాలుగు నెలల తర్వాత.. దక్షిణాదికి చెందిన ఈ బ్యాంకులో పెట్టుబడులకు మూడు సంస్థలు ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ‘‘ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, డీబీఎస్‌ ఇండియా లక్ష్మీ విలాస్‌ బ్యాంకులో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు రేసులో ఉన్నాయి. ఆర్‌బీఐ నిబంధనలకు

అమెరికా దిగుమతులపై టారీఫ్‌లను తగ్గించిన చైనా

Thursday 6th February 2020

గత ఏడాది అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 1,717 ఉత్పత్తులపై విధించే అదనపు సుంకాలను సగానికి తగ్గిస్తున్నట్లు చైనా గురువారం తెలిపింది. ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న తొలి దశ ఒప్పందంలో భాగంగా ఈ దిగుమతులపై సుంకాలను తగ్గించుకుంటున్న చైనా అధికారులు తెలిపారు. వాణిజ్య యుద్ధంలో భాగంగా... గతేడాది సెప్టెంబర్ 1 నుంచి అమెరికా దిగుమతులపై విధించిన సుంకాల తగ్గింపు ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి వస్తుందని చైనా ఆర్థిక మంత్రిత్వ

Most from this category