News


టెల్కోలకు ప్రభుత్వ సాయం: ఆర్‌బీఐ సూచన

Saturday 18th January 2020
Markets_main1579322769.png-31012

మొండి బకాయిల సమస్య తలెత్తే అవకాశం
టెలికం కంపెనీలకు భారీగా బ్యాంకు రుణాలు 
బకాయిల జాబితాలో పీఎస్‌యూలకూ చోటు

సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిల చెల్లింపులకు సంబంధించి టెలికం కంపెనీలకు కొంతమేర ఉపశమనాన్ని కల్పించవలసిందిగా రిజర్వ్‌ బ్యాంకు.. కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. మొండిబకాయిల(ఎన్‌పీఏలు) సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ.. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై తాత్కాలిక నిలిపివేత(మారటోరియం)ను ప్రకటించాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ భారీ ఎన్‌పీఏలతో కుదేలైన సంగతి తెలిసిందే. టెలికం కంపెనీలు భారీగా బ్యాంకింగ్‌ రుణాలను కలిగి ఉండటంతో రిజర్వ్‌ బ్యాంకు తాజాగా ప్రధాని కార్యాలయం(పీఎంవో), ఆర్థిక శాఖల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏజీఆర్‌ బకాయిలపై మారటోరియం అంశాన్ని ప్రస్తావించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 
 

జాబితాలో పలు బ్యాంకులు
మొబైల్‌ సేవల టెలికం కంపెనీలకు పలు బ్యాంకులు భారీగా రుణాలిచ్చాయి. ప్రధానంగా వొడాఫోన్‌ ఐడియా రూ. 53,000 కోట్లమేర ఏజీఆర్‌ బకాయిలను చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. నష్టాలు, రుణ భార సమస్యలు ఎదుర్కొంటున్న వొడాఫోన్‌ ప్రభుత్వం సహకరించకపోతే.. కార్యకలాపాల నిలిపివేత(దివాళా) పరిస్థితులు తలెత్తవచ్చంటూ ఇటీవల అసం‍తృప్తిని వ్యక్తం చేసిన విషయం విదితమే. వొడాఫోన్‌ ఐడియాకు యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ తదితరాలు అధిక రుణాలిచ్చినట్లు ఇప్పటికే యూబీఎస్‌ పేర్కొంది. సెప్టెంబర్‌ చివరికల్లా టెలికం రంగం బ్యాంకులకు చెల్లించవలసిన రుణాలు రూ. 1.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. ఏజీఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలు వేసిన రివ్యూ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో రూ. 1.47 లక్షల కోట్లమేర ఏజీఆర్‌ బకాయిలను టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించవలసిన పరిస్థితి తలెత్తింది. వీటిలో లైసెన్స్‌ ఫీజులు, స్పెక్ట్రమ్‌ చార్జీలు, జరిమానాలు, వడ్డీ తదితరాలు కలసి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఈ అంశంపై ఇంతక్రితం అక్టోబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నెల 23కల్లా 15 టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను చెల్లించవలసి ఉంది.

పీఎస్‌యూలూ..
టెలికం శాఖ(డాట్‌) అంచనాల ప్రకారం నాన్‌టెలికం కంపెనీలు సైతం రూ. 2.4 లక్షల కోట్లమేర బకాయిలు పడినట్లు తెలుస్తోంది. వీటిలో ప్రభుత్వ రంగ గ్యాస్‌ యుటిలిటీ కంపెనీ గెయిల్‌ ఇండియా, విద్యుత్‌ ప్రసార పీఎస్‌యూ పవర్‌గ్రిడ్‌ ఉన్నాయి. పైపులైన్లు, విద్యుత్‌ ప్రసార లైన్లకు అనుసంధానంగా ఆప్టిక్‌ ఫైబర్‌ను ఏర్పాటు చేసి బ్రాడ్‌బ్యాండ్‌ ట్రేడింగ్‌ను నిర్వహించేందుకు ఈ కంపెనీలు తీసుకున్న లైసెన్సులపై బకాయిలు చెల్లించవలసి ఉన్నట్లు విశ్లేషకులు వివరించారు. అయితే జనవరి 23 గడువు నాన్‌టెలికం కంపెనీలకు వర్తించబోదని కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. కాగా.. బకాయిల చెల్లింపులకు వీలుగా ఇప్పటికే మొబైల్‌ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ఇటీవల 3 బిలియన్‌ డాలర్ల(రూ. 21,000 కోట్లు)ను సమీకరించడం గమనార్హం!!You may be interested

రూ.260 పెరిగిన పసిడి

Saturday 18th January 2020

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో శుక్రవారం 10గ్రాముల పసిడి ధర రూ.260లు లాభపడింది. చైనా 2019లో  వృద్ధి 29 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.1 శాతానికి పడిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు కొనుగోలు మద్దతు లభించింది. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 17 పైసలు బలహీనపడటం దేశీయ పసిడి ప్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి

బంగారం రుణ మార్కెట్‌ రూ.4.61 లక్షల కోట్లు

Saturday 18th January 2020

2020 నాటికి ఈ మార్క్‌ను చేరుకుంటుంది: కేపీఎంజీ న్యూఢిల్లీ: బంగారం రుణాల మార్కెట్‌ శరవేగంగా మన దేశంలో వృద్ధి చెందుతోంది. 2022 నాటికి ఈ మార్కెట్‌ రూ.4,617 బిలియన్‌ రూపాయిలకు (రూ.4,61,700 కోట్లు) చేరుకుంటుందని కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రుణాల వృద్ధి వార్షికంగా 13.4 శాతం మేర ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను కేపీఎంజీ శుక్రవారం విడుదల చేసింది.  నివేదికలోని అంశాలు 2018-19లో బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీలు దేశంలోని

Most from this category