News


20-40 బీపీఎస్‌ రేట్ల కోత ఉంటుందా?

Friday 4th October 2019
Markets_main1570166996.png-28713

ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) శుక్రవారం వడ్డీరేట్లను మరింత తగ్గించనుందనే అంచనాలున్నాయి. వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందని, ఇది  20 నుంచి 40 బేసిస్‌ పాయింట్ల మధ్యలో ఉండే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్‌ ఆర్థిక వేత్తల సర్వే పేర్కొనడం గమనార్హం. కాగా ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 110 బేసిస్‌ పాయింట్లను తగ్గించి రెపో రేటును 5.4 శాతానికి పరిమితం చేసింది. గత మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో 35 బేసిస్‌ పాయింట్ల రేట్ల కోత చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ రంగాల ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఎంతమేర రేట్ల కోతను చేస్తుందోనని మార్కెట్‌ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

 ఈ రోజు ఉదయం 11.45 సమయానికి ఎంపీసీ రేట్ల కోతపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. తర్వాత 15 నిమిషాలలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడనున్నారు.



You may be interested

పాలసీ ప్రకటనకు ముందు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అప్రమత్తత

Friday 4th October 2019

భారీ లాభంతో ప్రారంభమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ క్రమంగా లాభాలను కొల్పోతుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు క్రితం ముగింపు (28,414)తో పోలిస్తే 278 పాయింట్లు లాభంతో 28,682 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతుతో ఇండెక్స్‌ 1.11శాతం(316 పాయింట్లు) పెరిగి 28730 స్థాయిని అందుకుంది. నేడు గం.11:30ని.లకు ఆర్‌బీఐ పాలసీ ప్రకటన

నాలుగో రోజూ లాభాల్లోనే పసిడి

Friday 4th October 2019

అమెరికా ఆర్థిక గణాంకాలు అంతంత మాత్రంగా నమోదు కావడంతో ఆర్థిక ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర నాలుగో రోజూ లాభాల్లో ట్రేడ్‌ అవతుంది. ఆసియాలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 2డాలర్లు లాభపడి 1,516 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతుంది. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌ ఈసారి కూడా వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ బలహీన ట్రేడింగ్‌ లాంటి అంశాలు

Most from this category