News


వడ్డీరేటు 1.7 శాతం తగ్గొచ్చు: ఫిచ్‌

Wednesday 18th March 2020
Markets_main1584525734.png-32560

వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2021-22) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లను కట్‌ చేయవచ్చని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేస్తోంది. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును ప్రభావితం చేసే రెపో రేటు 1.7శాతం తగ్గించవచ్చని తెలిపింది. మొదట 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించవచ్చని అంచనా వేసినప్పటికీ కరోనా వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ ఏడాదిలో వడ్డీరేటును 175 బేసిస్‌ పాయింట్లు తగ్గించవచ్చని ఫిచ్‌ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రెపోరేటు 5.15 శాతం నుంచి 3.40 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసింది. ఇక రివర్స్‌ రెపోరేటు సైతం 4.75 శాతం నుంచి 3 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసింది. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జి.డి.పి. 4.9 శాతంగా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో జి.డి.పి. వృద్ధి 5.4 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. చమురు ధరక్షీణించడం, ఫిబ్రవరిలో రబీ పంట చేతికి రావడంతో  ఆహా సరఫరా పెరిగి  గణనీయంగా ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేసింది. ఇటీవల ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లు తగ్గించాయి, ఈ క్రమంలోనే ఆర్బీఐకూడా  ద్రవ్యోల్బణాన్ని మరింత సులభతరం చేసేందుకు వడ్డీరేట్లు తగ్గించవచ్చని అంచనాల్లో తెలిపింది. ఇప్పటిదాక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కారణంగా 8,000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇండియాలో ఈరోజు(బుధవారం) వరకు 147 కేసులు నమోదైయ్యాయి. జనాభా పరంగా దేశంలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో ఆరోగ్య సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అభిప్రాయపడింది. భారత ద్రవ్యోల్బణాన్ని 3.5 శాతం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి తగ్గించింది. రష్యా, సౌదీ అరేబియాల మధ్య మార్చి8న మొదలైన చమురు ధరల పోరుతో అంతార్జాతీయంగా క్రూడ్‌ ధర  ఒక్కో బ్యారెల్‌ 50డాలర్ల నుంచి 30 డాలర్ల వరకు పడిపోయింది.ఇండియాలో ద్రవ్యోల్బణం జనవరిలో 7.6 శాతంగా ఉంటే ఫిబ్రవరిలో 6.6 చేరిందని తెలిపింది.కరోనా దాటికి ప్రపంచ బ్యాంకులన్నీ అత్యవసర సమావేశాలు జరిపి ద్రవ్యసడలింపు చర్యలను చేపట్టాయి. ఈక్రమంలోనే ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందని ఫిచ్‌ అంచనా వేసింది.You may be interested

8,500 దిగువకు నిఫ్టీ- అమ్మకాల వెల్లువ

Wednesday 18th March 2020

సెన్సెక్స్‌ 1710 పాయింట్లు పతనం 498 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ 29,000 దిగువకు చేరిన సెన్సెక్స్‌ 8,500 స్థాయినీ కోల్పోయిన నిఫ్టీ 4.5 శాతం నీరసించిన యూరోప్‌ మార్కెట్లు 5 శాతం డౌన్‌సర్క్యూట్‌ను తాకిన యూఎస్‌ ఫ్యూచర్స్‌ దేశీయంగా కరోనా కేసులు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా పలు దేశాలలో సంభవిస్తున్న వైరస్‌ మరణాలు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను మరోసారి కుంగతీస్తున్నాయి. మిడ్‌ సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో దేశీ మార్కెట్లు బోర్లా పడ్డాయి. సెన్సెక్స్‌ 1710 పాయింట్లు పడిపోయి

కరోనా కట్టడే పరిష్కారం, వడ్డీ రేట్లుకాదు!

Wednesday 18th March 2020

తగ్గినప్పుడల్లా ఇన్వెస్ట్‌ చేసే మార్కెట్‌ కాదు ప్రస్తుత సమస్యను 2008 పరిస్థితితో పోల్చేలేం వాతావరణం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం గ్లోబలైజేషన్‌తో సమస్యలు- నివారణపై దృష్టి పెట్టాలి - స్టీఫెన్‌ రోచ్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా మాజీ చైర్మన్‌ ఇంతక్రితం ఎన్నడూ ఎరుగని విధంగా సవాళ్లు విసురుతున్న కోవిడ్‌-19.. ప్రభావం భవిష్యత్‌లో కనిపించనున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా మాజీ చైర్మన్‌ స్టీఫెన్‌ రోచ్‌ పేర్కొంటున్నారు. పన్నెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలకు ఆర్థిక సమస్యలు సృష్టించిన సంక్షోభంతో ప్రస్తుత పరిస్థితులను

Most from this category